Navodaya exams: రేపటి నవోదయ ప్రవేశ పరీక్షలకు అంతా సిద్ధం
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష జరుగనుంది. నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్స రానికి 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తామని, గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష జరుగనుంది. నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్స రానికి 6వ తరగతిలో ప్రవేశాలకు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11.30 నుంచి 1.30 వరకు నిర్వహిస్తామని, గంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అన్నారు. ఏపీలో 416, తెలంగాణలో 244 సెంటర్లు ఏర్పాటు చేశామన్న అధికారులు..విద్యార్థులు తమ వెంట ఆధార్ కార్డు లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్, పరీక్ష ప్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో హాజరు కావాలని సూచించారు. ఈసారి నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఏపీలో 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది విద్యార్థులు ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.