జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపి వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్(National Women Commission) సీరియస్ అయింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది.

National Women Commission
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో నడిచి వెళ్తున్న యువతి బట్టలు చింపి వివస్త్రను చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్(National Women Commission) సీరియస్ అయింది. ఈ నెల 6న జరిగిన ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కేసుపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారంలోగా నివేదిక నివ్వాలని డీజీపీని(DGP) కోరింది. యువతికి న్యాయం చేయాలని ఆదేశించింది.
ఈ కేసులో నిందితుడు మారయ్యను(Maraiah) అరెస్టు(arrest) చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి సహకరించిన తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ బస్టాప్ రూట్‌లో నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై పెద్ద మారయ్య అనే కూలి పీకలదాకా మద్యం సేవించి దాడి చేశాడు. యువతి బట్టలు చింపి వివస్త్రను చేసి 15 నిమిషాల పాటు రోడ్డు మీద నగ్నంగా ఉంచాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
