అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్కలేనన్ని సౌర కుటుంబాలు(Solar families). ఒక్కో సౌరకుటుంబంలో ఎన్నో గ్రహాలు. వాటి చుట్టూ తిరుగుతూ ఉపగ్రహాలు. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ఆ భూమిపై లక్షల కొద్ది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న మనం. ఈ సువిశాల విశ్వంలో మనమొక్కరేమేనా? మనలాంటి వారు మరెక్కడైనా ఉన్నారా? బుద్ధి వికసించినప్పటి నుంచి మనల్ని వేధిస్తున్న ప్రశ్నలివి! తప్పకుండా జీవం ఉంటే ఉంటుంది. మనలాంటి బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారు. గ్రహాంతరవాసులను(Aliens) పసిగట్టేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు.

అనంతానంత విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్కలేనన్ని సౌర కుటుంబాలు(Solar families). ఒక్కో సౌరకుటుంబంలో ఎన్నో గ్రహాలు. వాటి చుట్టూ తిరుగుతూ ఉపగ్రహాలు. అందులో ఒకటి మనం నివసిస్తున్న భూమి. ఆ భూమిపై లక్షల కొద్ది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్న మనం. ఈ సువిశాల విశ్వంలో మనమొక్కరేమేనా? మనలాంటి వారు మరెక్కడైనా ఉన్నారా? బుద్ధి వికసించినప్పటి నుంచి మనల్ని వేధిస్తున్న ప్రశ్నలివి! తప్పకుండా జీవం ఉంటే ఉంటుంది. మనలాంటి బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారు. గ్రహాంతరవాసులను(Aliens) పసిగట్టేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా మన సౌరకుటుంబంలో జీవం ఆనవాళ్లు కనిపెట్టేందుకు అమెరికా అంతరిక్ష నౌక- నాసా సిద్ధమయ్యింది. ఇందుకోసం అధునాతన వ్యోమనౌకలను ప్రయోగించబోతున్నది. ఆ వ్యోమ నౌకలు మనకు ఇరుగుపొరుగున ఉన్న గ్రహాలను, ఉపగ్రహాలను నిశితంగా పరిశీలించబోతున్నాయి. ఈ ఏడాది అక్టోర్‌లో యురోపా క్లిప్పర్‌ అనే స్పేస్‌షిప్‌ను గురుగ్రహ కక్ష్యలోకి ప్రయోగించబోతున్నది. దాని ఉప్రగహమైన యూరోపాపై ఇది పరిశోధనలు చేస్తుది. గ్రహాంతర పరిశోధనలకు నాసా నిర్మించిన స్పేస్‌ షిప్‌లలో ఇదే పెద్దది.

సుమారు వంద అడుగుల పొడవుంటుంది. యూరోపాలో జీవుల మనుగడకు అనువైన పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయనేదానిని తెలుసుకుంటుంది. మన చందమామ అంత పరిమాణం ఉన్న యూరోపాలో గ్రహాంతర జీవానికి అనువైన పరిస్థితులు ఉండవచ్చని అనుకుంటున్నారు. మొత్తం మంచుతో కప్పి ఉన్న దీని ఉపరితలం కింద మహాసాగరం ఉండొచ్చని, అందులో జీవులు మనుగడ సాగిస్తుండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2028 జులైలో టైటాన్‌ డ్రాగన్‌ అనే వ్యోమనౌకను శనిగ్రహానికి చెందిన ఉప గ్రహం టైటాన్‌కు నాసా పంపుతోంది. 2034కు అది టైటాన్‌కు చేరుకుంటుంది. టైటాన్‌లో గ్రహాంతర జీవం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట్లో ఇది కూడా భూమిలాగే ఉండేదట! అందువల్ల టైటాన్‌పై పరిశోధనల ద్వారా ఆరంభంలో భూమిపై జీవం ఎలా పుట్టిందో తెలుసుకోవచ్చు. టైటాన్‌ కూడా హిమమయంగానే ఉంటుంది. వాతావరణం బంగారురంగులోని పొగమంచుతో నిండి ఉంటుంది.

సౌర కుటుంబంలో రెండో పెద్ద చందమామ ఇదే. దీని వ్యాసం 1600 మైళ్లు ఉంటుంది. అంటే బుధగ్రహం కంటే పెద్దదన్నమాట! భూమి తర్వాత సౌర కుటుంబంలో నీటితో కూడిన నదులు, సరస్సులు, సముద్రాలు కలిగిన ఖగోళ వస్తువు ఇదే. ఉపరితలం కింద కూడా సముద్రాలు ఉండవచ్చని అంచనా. భూమిలాగే టైటాన్‌ వాతావరణం కూడా ప్రధానంగా నత్రజనితో నిండి ఉంటుంది. కొద్దిగా మీథేన్‌ కూడా ఉంది. భూమిలో ఉన్నట్టుగానే టైటాన్‌పై కూడా జలచక్రం ఉంది. మేఘాల నుంచి ద్రవ రూపంలో వర్షాలు కురుస్తాయి. ఆ నీరు ఉపరితలం అంతటా ప్రవహించి సరస్సులను నింపుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆవిరి రూపంలో ఆకాశంలోకి వెళుతుంది. టైటాన్‌పైకి వెళ్లే స్పేస్‌షిప్‌కు ఎన్నో విశేషాలు ఉన్నాయి. హెలికాప్టర్‌ తరహాలో ఉండే టైటాన్‌ డ్రాగన్‌ ఫై అనే ఓ రోబోటిక్‌ రోటర్‌ క్రాఫ్ట్‌ను పంపుతున్నారు. ఇది నింగిలో నిలువుగా టేకాఫ్‌ కాగలదు. అలాగే కిందకు కూడా దిగగలదు. 2.7 ఏళ్లపాటు టైటాన్‌పై పరిశోధనలు చేసే టైటాన్‌ డ్రాగన్‌ ఫ్లై అక్కడ సేంద్రియ పదార్థాలతో కూడిన దిబ్బలు, అంతరిక్ష శిలల ఢీ వల్ల ఏర్పడ్డ బిలాలను పరిశీలిస్తుంది.

టైటాన్‌ వాతావరణం, దాని ఉపరితల లక్షణాలు, నేల దిగువన ఉన్న రిజర్వాయర్లను ఈ స్పేస్‌ షిప్‌ శోధిస్తుంది. ఇక 2028లో అంగారకుడిపై ఎక్సోమార్స్‌ రోవర్‌ను పంపుతున్నారు. అంగారకుడిపై ఒకప్పుడు ద్రవ రూపంలో నీరు పుష్కలంగా ప్రవహించినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. అలాగే జీవులకు అవసరమైన పోషకాలూ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంగారకుడిపై గతంలో అయస్కాంత క్షేత్రం ఉండేది. ఫలితంగా సౌర రేడియోధార్మికత నుంచి జీవులకు రక్షణ ఉండేది. అందుకే కుజుడిపై ఒకప్పుడు జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉండేవన్నది శాస్త్రవేత్తల గట్టి నమ్మకం. ఎక్సోమార్స్‌కు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నిజానికి ఇది ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ప్రాజెక్టు. అయితే నాసా దీన్ని డిజైన్‌ చేసింది. ఈ రోవర్‌ 300 కిలోల బరువుతో ఆరు చక్రాలు కలిగి ఉంది. నేలలో ఆరు అడుగుల పాటు డ్రిల్లింగ్‌ చేయడానికి అవసరమయ్యే పరికరాలు, ఒక ల్యాబ్‌ ఇందులో ఉంటాయి. మునుపు అంగారకుడిపై జీవం ఉండేదా అన్నది ఇది పరిశీలిస్తుంది. జీవానికి సంబంధించి సేంద్రియ నమూనాల కోసం శోధిస్తుంది.

Updated On 15 May 2024 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story