అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగతిలింది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన అనంతరం..పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అయితే..ఆయన మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

Narasaraopet mp resigns
అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగతిలింది. నరసరావుపేట ఎంపీ(Narasa Raopet MP) లావు కృష్ణదేవరాయలు రాజీనామా(Lau Krishnadevarayalu resigns) చేశారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన అనంతరం..పార్టీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుండి పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. అయితే..ఆయన మాత్రం నరసరావుపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానంలో తాను చేయాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అందుకే ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం పట్టించుకోని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్నూల్ ఎంపీ(Kurnool MP) సంజీవ్ కుమార్ (Sanjeev Kumar) వైసీపీకి గుడ్ బై చెప్పారు. మచిలీపట్టణం ఎంపీ(Machilipatnam MP) వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balashauri) కూడా రాజీనామా చేశారు. బాలశౌరి జనసేన కండువా కప్పుకోనున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేశారు. ఈసారి ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు హోరాహోరీగా ఎన్నికలు జరుగనున్ననేపథ్యంలో నరసరావు పేట ఎంపీ స్థానం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తుంది. అందుకే..వైసీపీ అధిష్టానం ఎంపీ లావు కృష్ణదేవరాయలును గుంటూరుకు మార్చాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
