కాలం బహు విచిత్రమైనది. పరిస్థితులు విషమించినప్పుడు శత్రువుతోనైనా చేతులు కలపాల్సి వస్తుంది. తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించాల్సి వస్తుంది. ఇది ఎవరి గురించి చెబుతున్నదో అర్థమయ్యే ఉంటుంది. అవును.. తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు గురించే.. 2019 ఎన్నికలకు ముందు ఎవరినైతే బీహారీ దొంగ అని తిట్టిపోశారో ఇప్పడు ఆయనే అక్కరకు కావాల్సి వచ్చింది. ప్రశాంత్‌ కిశోర్‌(Prashant kishore) అనే రాజకీయ వ్యూహకర్త మీద అప్పట్లో చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడారు.

కాలం బహు విచిత్రమైనది. పరిస్థితులు విషమించినప్పుడు శత్రువుతోనైనా చేతులు కలపాల్సి వస్తుంది. తిట్టిన నోటితోనే ప్రశంసలు కురిపించాల్సి వస్తుంది. ఇది ఎవరి గురించి చెబుతున్నదో అర్థమయ్యే ఉంటుంది. అవును.. తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత నారా చంద్రబాబునాయుడు గురించే.. 2019 ఎన్నికలకు ముందు ఎవరినైతే బీహారీ దొంగ అని తిట్టిపోశారో ఇప్పడు ఆయనే అక్కరకు కావాల్సి వచ్చింది. ప్రశాంత్‌ కిశోర్‌(Prashant kishore) అనే రాజకీయ వ్యూహకర్త మీద అప్పట్లో చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడారు. బీహారీ దొంగ రాష్ట్రాన్ని పాడుచేస్తున్నాడన్నారు. ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ తమ దగ్గర ఉంటే బాగుండని భావించారు చంద్రబాబు. ఆయనను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరానికి స్వయాన లోకేశ్‌ (Nara Lokesh) తీసుకొచ్చారు. వారం రోజుల కిందటి వరకు ప్రశాంత్‌ కిశోర్‌ను బండబూతులు తిట్టిన టీడీపీ బ్యాచ్‌ ఇప్పుడు పీకేకు చెక్క భజన చేయాల్సి వచ్చింది. ఖర్మ అంటే ఇదే ! అన్నట్టు లోకేశ్‌, ప్రశాంత్‌ కిశోర్‌ కలిసి వచ్చిన ఆ ప్రత్యేక విమానం ఎవరిదో కాదు, భారతీయ జనతా పార్టీకి(BJP) చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ది(CM Ramesh)! అదే విచిత్రం. చాన్నాళ్ల పాటు తెలుగుదేశంపార్టీలో ఉన్న సీఎం రమేశ్‌ ఓ ఫైన్‌ మార్నింగ్‌ బీజేపీలోకి జంపయ్యారు. చంద్రబాబే దగ్గరుండి ఆయనను బీజేపీలోకి పంపించారని అంటుంటారు. ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ మనసంతా టీడీపీవైపే ఉంటుంది. టీడీపీ అవసరాలన్నీ తీరుస్తుంటారు. ఇప్పటికీ చంద్రబాబును కీర్తిస్తుంటారు. అందుకే బీజేపీకి బద్ధశత్రువు అయినప్పటికీ చంద్రబాబు చెప్పారు కాబట్టి ప్రశాంత్‌ కిశోర్‌కు ఫ్లయిట్‌ను(Flight) సమకూర్చారు. బీజేపీ విముక్త భారత్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ పరితపిస్తుంటారు. అలాంటి వ్యక్తి బీజేపీ ఎంపీ విమానంలో ఎక్కి రావడమే ఆశ్చర్యం. అంటే సీఎం రమేశ్‌ బీజేపీ కంటే టీడీపీ అవసరాలే ముఖ్యమని భావిస్తున్నారేమో!

Updated On 23 Dec 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story