ఇది నవశకం..యుద్ధం మొదలైందని, తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. యువగళం-నవశకం(yuvagalam- Navashakam) సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది. యువగళం..మనగళం..ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషం.

ఇది నవశకం..యుద్ధం మొదలైందని, తాడేపల్లి తలుపులు బద్దలుకొట్టే వరకు ఈ యుద్ధం ఆగదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) అన్నారు. యువగళం-నవశకం(yuvagalam- Navashakam) సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుంది. యువగళం..మనగళం..ప్రజాగళం. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. లోకేశ్‌ది అంబేడ్కర్‌ రాజ్యాంగం పౌరుషం. యువగళం ముగింపు సభ కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు(Chandrababu), పవన్‌ను(Pawan kalyan) చూస్తే జగన్‌ భయపడతారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. విజనరీ అంటే చంద్రబాబు..ప్రిజనరీ అంటే జగన్‌. జగన్‌ అరెస్టు అయితే రోజుకో స్కాము బయటపడేది. ప్రజాస్వామ్యాన్ని జగన్‌ దెబ్బతీశారు. రూ.లక్ష కోట్లు దోచేసిన వ్యక్తి పేదవాడు అవుతారా? జగన్‌ అహంకారం..ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ చూపాలి : మూడు నెలల్లో ప్రజాస్వామ్యం(Democracy) పవర్ ఏంటో చూపాలి. ఆడుదాం ఆంధ్రా అంటూ కొత్త పథకం తెచ్చారు. మా జీవితాలతో ఆడారని ప్రజలు చెబుతున్నారు. జగన్‌ ఐపీఎల్‌ టీమ్‌ పేరు కోడికత్తి వారియర్స్‌. కోడికత్తి వారియర్స్‌ ఆటగాడు అవినాష్‌రెడ్డి(Aninash Reddy). బెట్టింగ్‌ స్టార్‌ అనిల్‌ యాదవ్‌(Anil Yadav).. అరగంట స్టార్‌ అంబటి(Ambati). గంట స్టార్‌ అవంతి.. ఆల్‌ రౌండర్‌ గోరంట్ల మాధవ్‌. రీల్‌ స్టార్‌ భరత్‌.. పించ్‌ హిట్టర్‌ బియ్యపు మధుసూదన్‌రెడ్డి. యువగళం పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది. అడుగడుగునా జగన్‌ విధ్వంసం కనిపించింది. రాజధానిని చంపి జగన్‌(CM Jagan) రాక్షసానందం పొందారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతామ ని లోకేశ్‌ వివరించారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’ పేరుతో తెదేపా భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయనగరం(Vijayanagaram) జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ(TDP) , జనసేన(Janasena) శ్రేణులు భారీగా తరలివచ్చారు.

పవన్ కల్యాణ్ కు స్వయంగా స్వాగతం పలికిన చంద్రబాబు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో, విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ ఏర్పాటు చేసింది. ఈ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విచ్చేశారు. సాయంత్రం విశాఖ(Vishaka) ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోలిపల్లి వచ్చారు. యువగళం విజయోత్సవ సభా ప్రాంగణం వద్ద పవన్ కల్యాణ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ(Balakrishna) తదితరులు స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ ను వారు సభా వేదిక వద్దకు తీసుకువచ్చారు. పవన్ రాకతో సభలో ఉన్న జనసేన పార్టీ శ్రేణుల కోలాహలం మిన్నంటింది. వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ పక్కపక్కనే కూర్చున్నారు. చంద్రబాబుకు మరోవైపున అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ తదితరులు కూర్చున్నారు.

Updated On 20 Dec 2023 8:43 AM GMT
Ehatv

Ehatv

Next Story