ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్(CM Jagan) రాబోయే ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు, కొందరికి సీట్ల నిరాకణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో తాడేపల్లిలోని(Tadepalli) సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనన్న భయం పట్టుకుంది. తాజాగా కృష్ణజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‎కు ఫోన్ కాల్ వెళ్లింది. తాడేపల్లికి వచ్చి సీఎంను, పార్టీ పెద్దలను కలవాలని అధికారులు చెప్పినట్టు సమాచారం.

ఏపీలో ఎన్నిలకు మరో కొన్ని నెలల సమయమే ఉంది. అయితే షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాల వేటలోపడ్డాయి. ఈ విషయంలో అధికార పార్టీ ఒక అడుగు ముందే ఉంది. అధికార వైసీపీ(YSRCP) అధినేత, సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే అనేక చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిన సంగతి తెలిసిందే. చాలా మంది సిట్టింగ్‎లను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిచి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే మైలవరం(Mylavaram) ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్ కాల్ వెళ్లిందట. తాడేపల్లికి వచ్చి సీఎంను కలవాలని..సదరు ఎమ్మెల్యేకు అధికారులు సూచించారట. అయితే..తనకు వేరేపని ఉందని, ఈరోజు రాలేనని వసంత ఫోన్‎లోనే అధికారులకు బదులిచ్చారట. అయితే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఎమ్మెల్యే వసంత సన్నిహితుల దగ్గర అన్నట్టుగా సమాచారం. అందుకే సీఎం జగన్ పిలిచినా వెళ్లలేదనే చర్చ జోరుగా వినిప్తోంది.

2018 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్ (vasantha krishna prasad)మైలవరం నుంచి పోటీ చేసి.. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాపై (Devineni Uma)గెలుపొందారు. మూడున్నరేళ్లు వీరవిధేయత చూపిన వసంత.. ఆ తర్వాత ధిక్కార స్వరం వినిపించం మొదలు పెట్టారు. వైసీపీలో కమ్మలకు (Kamma)ప్రాధాన్యం లేదని వసంత తండ్రి నాగేశ్వరరావు చేసిన కామెంట్స్..సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అలాగే టీడీపీ ఎంపీ కేశినేని నానితో భేటీ కావడం, బాలక్రిష్ణ(Balakrishna) సినిమా వీరసింహారెడ్డి విడుదల సమయంలో వసంత కృష్ణప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. దీంతో అలర్ట్ అయిన సీఎం జగన్..వసంతను తాడపల్లికి పిలిపించి మాట్లాడారు. ఆ వెంటనే వైఎస్ కుటుంబానికి వీర విధేయుడినని ప్రకటించారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్‎రెడ్డి (Kotamreddy sridhar reddy)సీఎం జగన్‎ను కలిసినప్పుడు ఇలాంటి మాటలే చెప్పారని..కృష్ణప్రసాద్ కూడా అదే బాటలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి వసంత టీడీపీలో చేరడం ఖాయమైపోయిందని ప్రచారం జరుగుతున్న సమయంలోనే తాడేపల్లి నుంచి ఫోన్ కాల్ రావడం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి నుంచి పిలుపు మార్పుకు సంకేతమేనని అంతా అనుకుంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‎పై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 23 Dec 2023 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story