వైఎస్సాఆర్‎సీపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు స్థానిక నేతల మధ్య చిచ్చుపెడుతోంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపైన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్(Minister Gudivada Amarnath)‎ను మార్చడంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప‌లువురు నేత‌లు రాజీనామాలు చేయ‌డం అధికార పార్టీని కలవరపెడుతోంది.

వైఎస్సాఆర్‎సీపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పు స్థానిక నేతల మధ్య చిచ్చుపెడుతోంది. అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలపైన సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే అనకాపల్లి నియోజకవర్గం నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్(Minister Gudivada Amarnath)‎ను మార్చడంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ప‌లువురు నేత‌లు రాజీనామాలు చేయ‌డం అధికార పార్టీని కలవరపెడుతోంది. తాజాగా మచిలీపట్నం లోక్‌సభ ఎంపీ(Machilipatnam Lok Sabha MP) బాలశౌరి(Balashauri) టీడీపీలోకి జంప్ చేయబోతున్నారని వార్తలు వైసీపీ(ycp)లో కలకలంరేపుతున్నాయి. గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు బాలశౌరి. అంతకుముందు 2004లో దివంగత వైఎస్ఆర్(ysr) నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి ఎంపీ(tenali mp)గా పని చేశారు. ఆయన వైసీపీని వీడితే పెద్ద ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆశావహులు తమ విధేయతను మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు కాంగ్రెస్‌లో చేరి వైఎస్‌ షర్మిలతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది. తాజాగా అమరావతి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Alla Ramakrishna Reddy), ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య(MLC Ramachandraiah), ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌(MLC Vamsikrishna Yadav)లు ఇప్పటికే అధికార పార్టీని వీడగా, గతంలో వుండవల్లి శ్రీదేవి(Vundavalli Sridevi), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(Mekapati Chandrasekhar Reddy), ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanaraya Reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఇతర పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన అభ్యర్థుల ప్రక్షాళన అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.

Updated On 5 Jan 2024 11:43 PM GMT
Ehatv

Ehatv

Next Story