ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు దృష్టిపెట్టారు సీఎం జగన్. అయితే తమ సిట్టింగ్ స్థానాలు మార్చడంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి పోటీ చేసే అవకాశం రాదని గ్రహించిన మరికొందరు నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. వీరంతా పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారుతున్నట్టు ప్రచారం జోరందుకుంది.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల మార్పు దృష్టిపెట్టారు సీఎం జగన్. అయితే తమ సిట్టింగ్ స్థానాలు మార్చడంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి పోటీ చేసే అవకాశం రాదని గ్రహించిన మరికొందరు నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. వీరంతా పార్టీ వీడే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్(mlc Vamshi Krishna Srinivas) పార్టీ మారుతున్నట్టు ప్రచారం జోరందుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులపై అంసతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇటీవల జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యీ వంశీకృష్ణ శ్రీనివాస్ వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో మారుతున్న రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారాలనుకుంటున్నారట. రేపు కాకినాడకు వస్తున్న జనసేన(Janaseana) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను కలువబోతున్నారని సమాచారం. పార్టీ మారడంపై ఇప్పటికే తన అనుచరవర్గంతో మంతనాలు జరిపారని..పవన్‌తో భేటీ తర్వాత వంశీకృష్ణ జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే.. భీమిలిలో జనసేన – టీడీపీ(tdp-Janasena అభ్యర్థిగా వంశీకృష్ణ పోటీ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడంతో వైజాగ్ వైసీపీలో కలకలం రేగింది. గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్‌గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్(Gvmc Mayor) పదవిని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో.. హరికుమారి(Harikumari)కి అవకాశం కల్పించారు సీఎం జగన్. దీనిపై అంసతృప్తిగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌కు..గత ఏడాది జరిగిన స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈసారి..ఆయనను విశాఖ ఎంపీగా లేదా గాజువాక ఎమ్మెల్యేగా పోటీచేయాలని హైకమాండ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే వంశీకృష్ణ ఎంపీగా పోటీ చేయనని తేల్చి చెప్పారట. యాదవ సామాజిక వర్గంలో కీలకనేతగా ఉన్న వంశీకృష్ణ పార్టీ మారుతున్నాడన్న వార్తలు ఆ పార్టీలో కలకంరేపుతున్నాయి.