మిర్చి రైతుల పంట పండింది. తాలు మిర్చికే క్వింటా రూ.15 వేల ధర పలుకుతోంది. ఇక నెంబర్ 1 రకం మిర్చికి ఏకంగా రూ.22 వేలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు రావడమే దీనికి కారణం. దీంతో ఈ ఏడాది మిర్చి పంటకు భారీ డిమాండ్ పెరిగింది. వరంగల్, ఖమ్మం, మలక్‎పేట​ మార్కెట్లకు వచ్చే మిర్చికి భారీగా ధర పలుకుతోంది. వండర్ హాట్ రకం మిర్చి ఏకంగా క్వింటాల్ రూ.28 వేల వరకు అమ్ముడుపోయింది.

మిర్చి రైతుల పంట పండింది. తాలు మిర్చికే క్వింటా రూ.15 వేల ధర పలుకుతోంది. ఇక నెంబర్ 1 రకం మిర్చికి ఏకంగా రూ.22 వేలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు రావడమే దీనికి కారణం. దీంతో ఈ ఏడాది మిర్చి పంటకు భారీ డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మొదటిసారి వేసిన మిర్చి వ్యవసాయ మార్కెట్లకు రావడం మొదలైంది. వరంగల్, ఖమ్మం, మలక్‎పేట​ మార్కెట్ల(Malakpet chilli Market)కు వచ్చే మిర్చికి భారీగా ధర పలుకుతోంది. వండర్ హాట్ రకం మిర్చి(Wonder hot type of chili)ఏకంగా క్వింటాల్ రూ.28 వేల వరకు అమ్ముడుపోయింది. శుక్రవారం ఏనుమాముల మార్కెట్‌‌‌‌‌‌‌‌(Enumamula Market)కు 127 క్వింటాళ్ల వండర్ హాట్ రకం మిర్చి వచ్చింది. నెంబర్ 1 మిర్చి కాదు..తాలు రకం మిర్చికి కూడా గిరాకీ బాగానే ఉంది. శుక్రవారం ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో తాలు మిర్చి క్వింటాల్‌‌ అత్యధికంగా రూ.9వేల నుంచి గరిష్టంగా రూ.15,500 ధర పలికింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. మలక్‌‌‌‌‌‌‌‌పేట్‎లోని మహబూబ్‌‌‌‌‌‌‌‌ మాన్షన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్(Mahbub Mansion Market)కు నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ రకం మిర్చి (number one type of chili) 923 క్వింటాళ్లు రాగా..క్వింటాల్‌ ‌‌‌‌‌‌‌కనిష్టంగా రూ.14వేలు, గరిష్టంగా రూ.22వేలు పలుకుతోంది. మోడల్‌‌‌‌‌‌‌‌ రూ.15వేల చొప్పున ధర పలికింది. శనివారం ఇదే మార్కెట్‌‌‌‌‌‌‌‌కు నంబర్ వన్ రకం మిర్చి 590 క్వింటాళ్లు రాగా..మరోసారి రూ.22వేల ధర పలికింది.. సోమవారం మాత్రం కేవలం 85 క్వింటాళ్లు రాగా, రూ.18వేలు పలికింది. నంబర్‌‌‌‌‌‌‌‌ 2 రకం శుక్రవారం 967 క్వింటాళ్లు, శనివారం 886 క్వింటాళ్లు మార్కెట్‎కు రాగా, గరిష్టంగా రూ.13వేల ధర పలికింది. తేజ రకం మిర్చి ఖమ్మం మార్కెట్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం 1,710 క్వింటాళ్లు వచ్చింది. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ రూ.29వేలు, వరంగల్‌‌‌‌‌‌‌‌లో రూ.22,500 ధర పలికింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated On 2 Jan 2024 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story