ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం (Zainath Mandal) జామిని(Jamini)లో ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రజాపాలనలో ఐదు గ్యారంటీ(Five guarantees)ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అక్కడి చేరుకున్న చాలా మంది మంత్రి సీతక్క(Minister Seethakka)ను.. మేడం అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం (Zainath Mandal) జామిని(Jamini)లో ప్రజా పాలన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క ఇంఛార్జీ మంత్రి(In-charge Minister)గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రజాపాలనలో ఐదు గ్యారంటీ(Five guarantees)ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. అక్కడి చేరుకున్న చాలా మంది మంత్రి సీతక్క(Minister Seethakka)ను మేడం..మేడం అంటూ పిలవడం మొదలుపెట్టారు. తను ప్రజాప్రతినిధిగా ఉన్నా.. నిరంతరం ప్రజలతో మమేకమయ్యే సీతక్కకు అలా పిలవడం నచ్చలేదు. వెంటనే వారిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి సూచించారు. మేడం అంటే దూరం అయిపోతము. అదే గుర్తు పెట్టుకోండి. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లిలాగా కలిసి పోతాం. పదవులు శాశ్వతం కాదు.. విలువలు, మంచి పనులే శాశ్వతం. కాంగ్రెస్ పాలన అంటే గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన. ప్రజలకు ఏ అవసరం ఉన్నా మాతో స్వేచ్చగా చెప్పుకోవచ్చని’’ ప్రజలకు అభయం ఇచ్చారు మంత్రి సీతక్క. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు ఇంఛార్జీ మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క..ఇవాళ ఉదయం జైనథ్ మండలం జామినిలో నిర్వహించిన ప్రజాపాలన(Prajapalana) కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.