తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. షర్మిల మెడలో ఉన్న కండువా కాంగ్రెస్‌ పార్టీది అయితే, ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది అని రోజా(Roja) కామెంట్‌ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు మేనిఫెస్టోలో(Manifesto) పెట్టినవి అమలు చేశానని ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు.

తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు(Chandra Babu), ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila)పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబాలను చీల్చడంలో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని విమర్శించారు. షర్మిల మెడలో ఉన్న కండువా కాంగ్రెస్‌ పార్టీది అయితే, ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది అని రోజా(Roja) కామెంట్‌ చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు మేనిఫెస్టోలో(Manifesto) పెట్టినవి అమలు చేశానని ధైర్యంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడేమో మళ్లీ అవకాశం ఇవ్వండంటూ సిగ్గులేకుండా అడుగుతున్నారని రోజా అన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌(NTR) కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్‌ఆర్‌(YSR) కుటుంబాన్ని చీల్చే పనిలో పడ్డారని, అసలు చంద్రబాబుకు ఇలాంటి అవకాశం ఇవ్వడమే షర్మిల చేసిన తప్పని రోజా పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి(YS Rajasekhar reddy) కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉందని, రాజశేఖర్‌రెడ్డి ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఎన్నికల్లో(Elections) పోటీ చేసేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని, వైసీపీ(YCP) నుంచి తరిమేసిన నాయకులను అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజాగారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటూ టీడీపీ అనుకూల మీడియా(Media) తప్పుడు ప్రచారం చేస్తుందని, ఇక్కడికి వచ్చి చూస్తే కళ్లకు కనిపిస్తుందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated On 2 Feb 2024 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story