Japan earthquake : జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను భారీ భూకంపం (earthquake)కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 (7.6-magnitude)గా నమోదయ్యింది. దీంతో జపాన్ (Japan)వాతావరణ సంస్థ సునామీ(tsunami ) హెచ్చరికలను జారీ చేసింది. సముద్ర అలలు అయిదు మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరంచింది.
జపాన్‌ను భారీ భూకంపం (earthquake)కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6 (7.6-magnitude)గా నమోదయ్యింది. దీంతో జపాన్ (Japan)వాతావరణ సంస్థ సునామీ(tsunami ) హెచ్చరికలను జారీ చేసింది. సముద్ర అలలు అయిదు మీటర్ల వరకు ఎగిసిపడే అవకాశం ఉందని హెచ్చరంచింది. ఇషికావా, నీగాటా, టొయామాప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో ఇప్పటికే సముద్రం(Sea) అల్లకల్లోలంగా మారింది. తీరంవైపు అలలు దూసుకు వస్తున్నాయి. మరోవైపు భూకంప దృశ్యాలు భయం కలిగిస్తున్నాయి. అయితే భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.