రవివర్మ తైలవర్ణ(Ravi Varma Thaila Varna) చిత్రంలా అందంగా ముగ్ధ మనోహరంగా వున్న ఈమె పేరు మాతా హరి(Matha Hari)..ఇది ఆమె డాన్సరయ్యాక పెట్టుకున్న పేరు.. అసలు పేరు మార్గరేటా గీట్రూడా జెల్లి మెక్‌లీడ్‌(Margareta Geetrude Jelly McLeod).. అంత పెద్ద పేరును పిలవడం కష్టం కాబట్టి మాతా హరి అని సంక్షిప్తంగా పేరు పెట్టేసుకున్నారామె! ప్రపంచంలో పేరుగాంచిన మహిళా గూఢచారిలలో(Female Spy) ఈమెది ప్రత్యేక స్థానం..తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. హిట్లర్‌(Hitler) దగ్గర గూఢచారిగా పని చేశారు మాతా హరి. 1876లో నెదర్లాండ్‌లో జన్మించారు మాతాహరి.

రవివర్మ తైలవర్ణ(Ravi Varma Thaila Varna) చిత్రంలా అందంగా ముగ్ధ మనోహరంగా వున్న ఈమె పేరు మాతా హరి(Matha Hari)..ఇది ఆమె డాన్సరయ్యాక పెట్టుకున్న పేరు.. అసలు పేరు మార్గరేటా గీట్రూడా జెల్లి మెక్‌లీడ్‌(Margareta Geetrude Jelly McLeod).. అంత పెద్ద పేరును పిలవడం కష్టం కాబట్టి మాతా హరి అని సంక్షిప్తంగా పేరు పెట్టేసుకున్నారామె! ప్రపంచంలో పేరుగాంచిన మహిళా గూఢచారిలలో(Female Spy) ఈమెది ప్రత్యేక స్థానం..తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. హిట్లర్‌(Hitler) దగ్గర గూఢచారిగా పని చేశారు మాతా హరి. 1876లో నెదర్లాండ్‌లో జన్మించారు మాతాహరి. ఈమె చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. కాసింత జ్ఞానం అబ్బకమునుపే తల్లి చనిపోయారు. భయంకరమైన పేదరికం.. ఇవన్నీ మాతాహరిలో ఓ రకమైన కసిని పెచాయి. తెలియని మానసిక వేదనతో బాధపడేది. తన అపరిమితమైన కోరికలను తీర్చుకోవడానికి 1905లో పారిస్‌కు చేరారు. పేరున్న డాన్సర్‌ కాబట్టి దేశ దేశాలు తిరిగారు. ఆమె అపురూపమైన సౌందర్యరాశి కాబట్టే చాలా మంది అధికారులు ఆమెకు దాసోహమయ్యారు. పలు దేశాల అధినేతలు, సైన్యాధికారులు, మంత్రులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వారితో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని చక్కగా వాడుకున్నారు మాతాహరి. ఒకరి రహస్యాలను మరొకరికి చేరవేసే పనిని చేపట్టారు.
అది మొదటి ప్రపంచ యుద్ధ(World War-1) సమయం. దేశాలన్నీ కొట్టుకు చస్తున్నాయి. మతాహరిలోని అందం, చందం, పాపులారిటీని జర్మనీ చక్కగా ఉపయోగించుకుంది. హిట్లర్‌కు గూఢచారిగా పని చేసింది. విషయం తెలుసుకున్న ఫ్రాన్స్‌(France) ఈమెను అరెస్ట్‌ చేసింది. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని రుజువు కాలేదు. ఆమె కేవలం డాన్సర్‌ మాత్రమేనని న్యాయస్థానం చెప్పింది. అయినప్పటికీ ఫ్రాన్స్‌ ప్రభుత్వం 1917, అక్టోబర్‌ 15న ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపింది. అప్పుడామె వయసు కేవలం 41 ఏళ్లే. మాతాహరి చనిపోయిన తర్వాత ఏడో దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు వెలుగు చూశాయి. జర్మనీకి గూఢచర్యం చేసినట్టు ఆ పత్రాల ద్వారా తెలిసింది. ఈమె జీవితగాధ ఆధారంగా హాలీవుడ్‌లో ఓ సినిమా కూడా వచ్చింది.

Updated On 20 July 2023 4:52 AM GMT
Ehatv

Ehatv

Next Story