తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ కొన్ని సూచనలు చేసింది. కొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని, UAPA కేసులను రద్దు చేయాలని, ఎన్‌ఐఏ దాడులను నిలిపివేయాలని ప్రభుత్వానికి కోరింది. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని ఆకాంక్షించింది. కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

తెలంగాణలో(Telangana) నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ(Maoist Party) కొన్ని సూచనలు చేసింది. కొన్ని డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని, UAPA కేసులను రద్దు చేయాలని, ఎన్‌ఐఏ దాడులను నిలిపివేయాలని ప్రభుత్వానికి కోరింది. ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని ఆకాంక్షించింది. కేసీఆర్‌కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాళేశ్వర పేరిట దోపిడీ, మిషన్‌ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం .. ఇలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను వంచించిందని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌(Maoist party spokesperson Jagan)బహిరంగలేఖలో పేర్కొన్నారు. కేసీఆర్‌(KCR)కు అన్ని ఆస్తులెక్కడివి? హరీశ్‌రావు(HARISHRAO) ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్‌(KTR), కవిత(KAVITHA), సంతోష్‌రావు(SANTHOSHRAO)ల ఆర్ధికస్థితిగతులపై వాస్తవాలు ఏమిటి? కాళేశ్వరం ద్వారా కృష్ణారెడ్డి(KRISHNAREDDY మీదుగా కల్వకుంట్ల కుటుంబం(Kalvakuntla family) పొందిన పర్సెంటీజల వివరాలు ఏమిటి? సెక్రటేరియట్‌, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్‌ విగ్రహం, వరంగల్‌ హాస్పిటల్‌ ద్వారా కేసీఆర్‌ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? వీటికి సమాధానాలు తెలియాల్సిన తెలంగాణ సమాజానికి వుందని మావోయిస్ట్ పార్టీ అంటోంది.

Updated On 3 Jan 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story