✕
కొందరు నదిలో ఈత కొడుతుంటే వింత వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. స్నానం చేస్తుండగా కొన్నిసార్లు పాములు ఎంటరైతే..

x
కొందరు నదిలో ఈత కొడుతుంటే వింత వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. స్నానం చేస్తుండగా కొన్నిసార్లు పాములు ఎంటరైతే.. మరికొన్నిసార్లు పెద్ద పెద్ద చేపలు దాడి చేయడానికి వస్తుంటాయి. అయినా చాలా మంది త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నదిలో స్నానం చేస్తుండగా... కాళ్ల కింద కదలిక కనిపించింది. ఏంటా అని బయటికి తీసి చూడగా... షాకింగ్ సీన్ కనిపించింది. కొందరు నదిలో పడవపై షికారుకు వెళ్లారు. ఓ వ్యక్తి పడవ నుంచి నీటిలోకి దిగి ఈత కొట్టాడు. కాళ్ల కింద ఏదో కదలిక రావడంతో ఏముందా.. అని కాళ్లకు తగిలిన దాన్ని బయటికి తీసి చూడగా.. మొసలి నోరు తెరచి కనిపించింది. దాన్ని చూడగానే భయంతో దూరంగా విసిరేసి పడవలోకి ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.

ehatv
Next Story