తాంత్రిక పూజల(Black Magic) పేరుతో పది మందికిపైగా అమాయక ప్రజలను హత్య(Murder) చేశాడో దుర్మార్గుడు. నాగర్‌ కర్నూల్‌(Nagar Kurnool) మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి జిల్లా కేంద్రంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2018లో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత కొత్త అవతారం ఎత్తాడు. తనకు తాంత్రిక పూజలు వచ్చంటూ, ఇళ్లల్లో, పొలాల్లో గుప్త నిధులను వెలికి తీస్తానంటూ అమాయక ప్రజలను నమ్మించసాగాడు. పాపం అమాయకులు ఇతగాడి బుట్టలో పడేవారు. పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పించుకునేవారు.

డబ్బులు లేవన్న వారి స్థిరాస్తులను(Property) తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడు. నిధులు దొరికిన తర్వాత తనకు డబ్బులు ఇస్తే మళ్లీ వారిపేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తానని నమ్మించేవాడు. తాము మోసపోయామన్న విషయాన్ని గ్రహించిన తర్వాత తమ ఆస్తులను తమకు ఇచ్చేయాలంటూ నిలదీశారు కొందరు. వారికి ఇదిగో అదిగో అని చెబతూ తప్పించుకుని తిరిగేవాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని ఒత్తిడి చేసిన వారిని క్షుద్రపూజల పేరిట దూరప్రాంతాలకు తీసుకెళ్లి చంపేసేవాడు. వనపర్తి జిల్లా రేపల్లి మండలం నాగపూర్‌లో 2020, ఆగస్టు 14న ఓకే కుటుంబానికి చెందిన హజీరామ్‌బీ (60), అస్మాన్‌బేగం(42), ఖాజాపాషా(45), అర్షిణ్‌ బేగం(9)లు హత్యకు గురయ్యారు.

వీరు తాగిన పాలలో(Milk) బంగారం కరిగించే రసాయనం కలిపినట్టు దర్యాప్తులో తేలింది. ఖాజాపాషా పేరిట నాగర్‌కర్నూల్‌ పట్టణంలో ఉన్న ప్లాటును నిందితుడు తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత ఈ హత్యలకు పాల్పడినట్లు బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఏడాది కిందట నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(Ram Reddy) ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో, ఆయన కూతురు కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని రాయచూర్‌లో ఇలాగే హత్యకు గురయ్యారు. కల్వకుర్తికి చెందిన మరో వ్యక్తిని అమ్రాబాద్‌ నల్లమల అటవీ ప్రాంతంలో హత్య చేశారు.

ఏడాదిన్నర క్రితం నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన లింగస్వామిని చందుబట్ల గేట్‌ దగ్గర హత్య చేశారు. ఇలా వివిధ ప్రాంతాలలో పది మందికిపైగా హత్యకు గురయ్యారు. ఆయా పోలీసుస్టేషన్‌లలో ఇవన్నీ అనుమానాస్పద మృతిగా కేసులు నమోదయ్యాయి.
వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రిలయ్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉండేవాడు. నవంబర్‌లో నగర శివారులో అతడిని హత్య చేశారు.

వెంకటేశ్‌ కుటుంబసభ్యులతో నిందితుడికి కొంతకాలంగా పరిచయం ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. నవంబర్‌ 26వ తేదీన వారు నాగర్‌కర్నూల్‌ పట్టణ పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. వెంకటేశ్‌ దగ్గర నిందితుడు డబ్బులు తీసుకున్న తర్వాత క్షుద్రపూజల పేరుతో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకుని విచారించారు. నిందితుడు ఇదే విధంగ అనేక హత్యలు చేసినట్టు విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం పోలీసులు మీడియాకు తెలిపే అవకాశం ఉంది.

Updated On 12 Dec 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story