ఓ వ్యక్తికి మామూలు సుడి తగలలేదు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే లాటరీ(Lottery) తగిలినట్లు అమెరికాలోని(America) ఫ్లోరిడాకు(florida) చెందిన ఓ వ్యక్తికి ఓ లాటరీ తగిలింది. అంచనాలకు అందని విధంగా ఈ లాటరీ తగలడంతో ఈ వ్యక్తి నమ్మలేదట. ఇందుకు తనకు తానే ఓ సారి గిచ్చుకొని ఇది నిజామా? కాదా? అని చెక్‌ చేసుకున్నాడట.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి రూ.166 ( అక్షరాల నూటా అరవై ఆరు రూపాయలు) ఖర్చు చేసి కొన్న లాటరీ టికెట్‌కు(Loterry ticket) వచ్చిన బహుమతి తెలిస్తే ఆశ్చర్యపోకమానరు. మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి వందలు, వేల రెట్లకుపైగానే లాటరీ తగలింది. అతనికి వచ్చిన బహుమతి మొత్తం 160 కోట్ల డాలర్లు అంటే 'రూ.13,339 కోట్లు'. మెగా మిలియన్ లాటరీలో(Mega Million Lottery) భాగంగా ఈ భారీ లాటరీ తగిలింది. సెప్టెంబరు 27న విజేతను ప్రకటించినా లాటరీ పొందిన వ్యక్తి వివరాలను బయటకు వెల్లడించలేదు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీని కొనుగోలు చేశారని.. ఈ భారీ లాటరీ ఆ యజమానికి తగిలిందని వెల్లడించారు. మెగా మిలియన్ లాటరీ చరిత్రలో ఇదే అత్యధిక బహుమతిగా చెబుతున్నారు. లాటరీ టికెట్ విక్రయించిన జాక్సన్ విల్లే ప్రాంతంలోని గ్రోసరీ స్టోర్‌కు రూ.83 లక్షల కమీషన్‌ లభించినట్లుగా చెబుతున్నారు. చూశారా మనోడి లక్ ఎలా ఉందో.. లాటరీ తగిలితే ఇలా ఉండాలనుకుంటున్నారు.

Updated On 31 Dec 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story