Mahatma Gandhi : గాంధీని దేవతగా కొలిచే ఊరు, ఎక్కడో తెలుసా ?
ఇంతవరకు మనం జాతిపిత గాంధీ(Gandhi) కి విగ్రహాలు పెట్టడం, గుళ్ళు కట్టడం, రహదారులకి, వీధులకి పేరు పెట్టడమే చూసాము. కానీ ఆ ఊర్లో మాత్రం దేవతగా మలిచారు. గాంధీ ని గాంధమ్మ మలిచి కొలుస్తున్నారు.
ఇంతవరకు మనం జాతిపిత గాంధీ(Gandhi) కి విగ్రహాలు పెట్టడం, గుళ్ళు కట్టడం, రహదారులకి, వీధులకి పేరు పెట్టడమే చూసాము. కానీ ఆ ఊర్లో మాత్రం దేవతగా మలిచారు. గాంధీ ని గాంధమ్మ మలిచి కొలుస్తున్నారు.
మీరు చూస్తున్న ఈ నృత్యాలు ఏదో ఊరుపండగనో ,పెళ్లి సందడినో కాదు. అక్కడ పొలం పనులు(Farming) ప్రారంభానికి ముందు గ్రామస్తులంతా కలిసి గాంధమ్మకు మొక్కులు చెల్లిస్తారు.
వ్యవసాయ పనులని ఏరువాక పౌర్ణమి రోజునో, గ్రామదేవత పూజతోనో లేదా కనీసం గోమాత(COW) పూజతోనో మొదలుపెడతారు కదా ఈ గాంధమ్మ ఎంత అనేగా మీ సందేహం అక్కడికే వస్తున్నా.
ఖరీఫ్ పనులు ఆరంభించడానికి ముందు ఆ ఊరంతా కలిసి గాంధమ్మకు(Gandhamma) పూజించి సేధ్యం చేస్తారు. దీంతో ఊరు ఊరంతా సందడి నెలకొంటుంది. ఆ గ్రామానికి మధ్యలనే గాంధమ్మ దేవతగా భావించి మొక్కులు చెల్లిస్తారు. కేదారిపురంలో మాత్రం గాంధమ్మను మొక్కుకునే దమ్ముపనులు ఆరంభిస్తారు.
అలాఅని మేక, కోడి వంటివాటిని బలివ్వరు మహాత్మగాంధీ సిద్దాంతాలను అనుసరించి నెయ్యి ముద్దలు, పండ్లు ఫలహారాలతో పూజిస్తారు. జీవహింసకు దూరంగా ఉంటారు. అలాగే వివిధ రకాల పండ్ల రసాలతో పానకం చేసి నైవేద్యంగా పెడతారు. ఈ సందర్భంగా వారు ఆటపాటలతో ఎంతో సందడి చేస్తారు. భాజాభజీంత్రిలతో ఊరు ఊరంతా గాంధమ్మ పూజలో నిమగ్నమవ్వడం కేదారిపురం
ప్రత్యేకత.
ఇంతా చెప్పారు కానీ అసలు ఆ గ్రామం ఎక్కడుందో అనేగా మీ సందేహం. శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఉంది ఈ కేదారిపురం(Kedharipuram) గ్రామం. ఇప్పుడే కాదు స్వతంత్ర పోరాట సమయం నుంచి కేదారిపురం గ్రామం తో పాటు చుట్టు పక్కల ఊర్లల్లో కూడా సంప్రదాయం కొనసాగుతోంది.