News Channels Ratings : తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. దాంతో పాటే పెరిగిన న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్
గత పక్షం రోజులు తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాట్లు వగైరా వగైరాలతో గడిచిపోయింది. తెలంగాణలో రాజకీయం చలికాలంలోనూ వేడి(Heat) పుట్టించింది. జనం ఆసక్తిగా న్యూస్ ఛానెళ్ల (News Channels)ముందు కూర్చున్న సందర్భం చాలా కాలం తర్వాత కనిపించింది. న్యూస్ పట్ల పెద్దగా ఆసక్తికనబర్చని వారు కూడా న్యూస్ ఛానెళ్లను ట్యూన్ చేసుకున్నారు. ఆ ప్రభావం న్యూస్ ఛానెళ్ల రేటింగులపై(Ratings) పడింది. దాదాపుగా అన్ని ఛానెళ్ల రేటింగులు అంతో కొంతో పెరిగాయి. చెప్పుకోదగ్గర విషయమేమిటంటే రోజురోజుకీ దిగజారిపోతున్న టీవీ9(TV9) రేటింగ్స్ ఊహించనంతగా పెరగడం.
గత పక్షం రోజులు తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాట్లు వగైరా వగైరాలతో గడిచిపోయింది. తెలంగాణలో రాజకీయం చలికాలంలోనూ వేడి(Heat) పుట్టించింది. జనం ఆసక్తిగా న్యూస్ ఛానెళ్ల (News Channels)ముందు కూర్చున్న సందర్భం చాలా కాలం తర్వాత కనిపించింది. న్యూస్ పట్ల పెద్దగా ఆసక్తికనబర్చని వారు కూడా న్యూస్ ఛానెళ్లను ట్యూన్ చేసుకున్నారు. ఆ ప్రభావం న్యూస్ ఛానెళ్ల రేటింగులపై(Ratings) పడింది. దాదాపుగా అన్ని ఛానెళ్ల రేటింగులు అంతో కొంతో పెరిగాయి. చెప్పుకోదగ్గర విషయమేమిటంటే రోజురోజుకీ దిగజారిపోతున్న టీవీ9(TV9) రేటింగ్స్ ఊహించనంతగా పెరగడం. ఎలాగైతేనేమీ మళ్లీ నంబర్‌వన్‌కు వచ్చేసింది. చాన్నాళ్లుగా అగ్రస్థానంలో ఉన్న ఎన్‌టీవీ(Ntv) ఇప్పుడు సెకండ్‌ప్లేస్‌కు చేరుకుంది. ఇంతగా తమ రేటింగ్ పెరుగుతుందని బహుశా టీవీ9 కూడా అనుకోని ఉండదు. లాస్ట్ వీక్ టీవీ 9 జీఆర్పీ 75 ఉంటే ఎన్‌టీవీ 83 ఉంది. అంటే ఎన్‌టీవీ ఎనిమిది పాయింట్లు (Points)ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు టీవీ 9 ఏకంగా 106 జీఆర్పీలకు(GRP) చేరుకుంది. లాస్ట్ వీక్‌తో పోలిస్తే 31 పాయింట్లు ఎక్కువ. అంటే 40 శాతం వరకు పెరుగుదల. ఎన్‌టీవీ మాత్రం 13 పాయింట్లను మాత్రమే అదనంగా సంపాదించుకోగలిగింది. బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, కేసీఆర్ మీద ప్రజలలో వ్యతిరేకత ఉందన్న ప్రచారాలు జరిగినప్పటికీ ఆ పార్టీ ఛానెల్ టీ న్యూస్(T-news) కూడా అదనంగా ఒక పాయింట్‌ను సంపాదించుకుంది. అంటే ఈ రేటింగ్స్ అన్నీ ఎన్నికల(Elections) వల్లనే వచ్చాయని అనుకోవాలి. పొద్దస్తమానం చంద్రబాబు సేవలో తరించిపోయే టీవీ 5(Tv5) పెద్దగా రేటింగ్స్‌ను సాధించలేకపోయింది. తెలుగుదేశంపార్టీకి(TDP) బాకా ఊదే ఎబీఎన్ (ANB)రేటింగ్‌కు అంతంత మాత్రంగానే పెరిగింది. అదే సమయంలో సాక్షిటీవీ(Sakshi) రేటింగ్స్ కూడా డిటో డిటో. 49వ వారం రేటింగ్స్‌ను ఎప్పటి వరకు తీసుకున్నారంటే డిసెంబర్ 1వ తేదీ వరకు. ఎన్నికల ఫలితాలు వచ్చింది డిసెంబర్ 3వ తేదీన! ఆ తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ఎన్నికలో సస్పెన్స్‌లు.. ఇవన్నీ 50 వ వారం కిందకు వస్తాయి. అంటే వచ్చే వారం కూడా న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్‌లో భారీ పెరుగుదలను ఎక్స్‌పెక్ట్ చేయవచ్చన్నమాట!