ITR... ఆదాయపు పన్ను రిటర్న్(Income Tax Return). భారతదేశ ఆదాయపు పన్ను చట్టాలు ప్రభుత్వంచే రూపొందించబడినవి.. కంపెనీలు, సంస్థలు, ఎల్ఎల్పీ, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తుంది ప్రభుత్వం. భారత దేశ నివాసిగా అర్హత పొందిన ప్రతి వ్యక్తి ప్రపంచ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి.

ITR... ఆదాయపు పన్ను రిటర్న్(Income Tax Return). భారతదేశ ఆదాయపు పన్ను చట్టాలు ప్రభుత్వంచే రూపొందించబడినవి.. కంపెనీలు, సంస్థలు, ఎల్ఎల్పీ, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై పన్ను విధిస్తుంది ప్రభుత్వం. భారత దేశ నివాసిగా అర్హత పొందిన ప్రతి వ్యక్తి ప్రపంచ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి. ఐటీఆర్(ITR) అంటే.. మీ ఆదాయం, పన్ను గురించిన పూర్తి సమాచారాన్ని ఫైల్ చేయడానికి ఉపయోగించే ఒక ఫారమ్. 2022-23 ఆర్థిక సంవత్సరం అలాగే 2023 -24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరితేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్ నంబర్ 1 ద్వారా ఐటీఆర్ దాఖలు చేస్తారు. ఐటీఆర్ ఫారమ్ నంబర్ 1 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం అత్యంత సులువైన పని.

ITR No-1ని ఎవరు ఫైల్ చేయవచ్చు
ఒక ఆర్థిక సంవత్సరంలో వారి మొత్తం ఆదాయం(Annual Income) రూ. 50 లక్షల కంటే తక్కువ, జీతం, ఒక ఇంటి ఆస్తి, బ్యాంకు నుండి వడ్డీ, డివిడెండ్, వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 5000, అటువంటి పన్ను చెల్లింపుదారులు, ఐటీఆర్ ఫారమ్ నంబర్ 1(ITR Form 1) ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్ చేయాలి. అన్‌లిస్టెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు. ఒక కంపెనీలో డైరెక్టర్లుఈ ఐటీఆర్ ఫారమ్ నంబర్ 1 ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు.

ITR ఫారమ్ నంబర్ 1ని ఎలా చేయాలంటే..
1. ముందుగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal కి వెళ్లి అక్కడ మీ పాన్ లేదా ఆధార్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయాలి.
2. ఆ తర్వాత ఈ-ఫైల్‌పై క్లిక్ చేసి, ఆపై ఆదాయపు పన్ను రిటర్న్‌పై క్లిక్ చేసి, ఆపై ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ బటన్‌పై క్లిక్ చేయండి.
3. అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంచుకుని, ఫైలింగ్ మోడ్‌ని సెలక్ట్ చేసిన తర్వాత అంటే ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనసాగించుపై క్లిక్ చేయండి.
4. తర్వాత మీ వ్యక్తిగత స్థితిని ఎంచుకుని నెక్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
5. ITR ఫారమ్‌లోని డ్రాప్‌డౌన్‌కు వెళ్లి ITR ఫారమ్ No-1ని సెలక్ట్ చేసుకోవాలి. మీ ఆదాయం మొత్తం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మించకపోయినా, కొన్ని పరిస్థితులలో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం అవసరం. మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్న కారణాన్ని ఎంచుకున్న తర్వాత కొనసాగించండి.
6. తర్వాతి పేజీలో వ్యక్తిగత సమాచారం, మొత్తం ఆదాయం, మొత్తం మినహాయింపు, చెల్లించిన పన్ను, మొత్తం పన్ను వివరాలను 5 విభాగాల కనిపిస్తాయి. ఈ విభాగాలన్నింటిలో ముందుగా ఎంటర్ చేసిన డేటాతో మీ వివరాలను ధృవీకరించాలి. అవసరమైతే అందులో మార్పులు కూడా చేసుకోవచ్చు. మీ జీతం, హెచ్‌ఆర్‌ఏ అన్నీ ముందే ఎంటర్ చేసి ఉంటాయి. కానీ మీ ఫారమ్-16తో మొత్తం సమాచారం సరిపోలి ఉండాలి. ఇంటి ప్రాపర్టీ నుండి ఆదాయం వస్తే, లెట్ అవుట్ ప్రాపర్టీని ఎంచుకోవాలి. పొదుపు ఖాతా లేదా FD నుండి పొందిన వడ్డీ మొత్తాన్ని ఎంటర్ చేయకూడదు.
పన్ను చెల్లింపు విభాగంలో ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన పన్ను వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత, మొత్తం పన్ను విభాగంలో మొత్తం పన్నును పరిశీలించాలి.
ITR ఫారమ్‌లో అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వా తర్వాత, రిటర్న్‌ను ప్రివ్యూ చేయడానికి ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి. సమాచారం అంతా సరిగ్గా ఉంటే మీ రిటర్న్‌ను సమర్పించవచ్చు.
7. ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత, దాని వెరిఫికేషన్ చాలా ముఖ్యమైనది. 30 రోజులలోపు వెరిఫై చేయకపోతే రిటర్న్‌లు చెల్లవు. ITR ధృవీకరించినప్పుడు మాత్రమే ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ను ప్రాసెస్ చేస్తుంది. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్, ఆధార్ ఆధారిత OTP పంపడం ద్వారా లేదా CPC బెంగళూరుకు రిటర్న్ యొక్క రసీదు కాపీని పంపడం ద్వారా కూడా ధృవీకరణ చేయవచ్చు. ఈ ప్రక్రియ తర్వాత, పన్ను చెల్లింపుదారుడు రిటర్న్ దాఖలు చేసినట్లు SMS, ఇమెయిల్ ద్వారా రిటర్న్ ఫైలింగ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది.

Updated On 15 Jun 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story