Lakshmi Parvathi on CM : రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress) ముఖ్యమంత్రులు ఏ నిర్ణయం తీసుకోవలనుకున్నా ఢిల్లీ అనుమతి తప్పనిసరి ఉండాల్సిందేనన్నారు. అనుభవ రాహిత్యం, పరిణితి లేకుండా రేవంత్ పాలన కొనసాగుతోందని ఆమె అన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ(Telangana) ప్రజలకు కష్టాలు తప్పవని లక్ష్మీపార్వతి అన్నారు.

lakshmi parvathi
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్(Congress) ముఖ్యమంత్రులు ఏ నిర్ణయం తీసుకోవలనుకున్నా ఢిల్లీ అనుమతి తప్పనిసరి ఉండాల్సిందేనన్నారు. అనుభవ రాహిత్యం, పరిణితి లేకుండా రేవంత్ పాలన కొనసాగుతోందని ఆమె అన్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ(Telangana) ప్రజలకు కష్టాలు తప్పవని లక్ష్మీపార్వతి అన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి వచ్చిన లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత ఈజీగా ప్రజా సమస్యలు పరిష్కారం కావని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్(KCR) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో నిలిపారని లక్ష్మీపార్వతి(Lakshmi parvathi) ప్రశంసించారు. ప్రతీ రంగాన్ని కేసీఆర్ ముందంజలో ఉంచారని.. రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. మిషన్ కాకతీయ(Mission Kakatiya) కార్యక్రమంతో భూగర్భ జలవనరులు పెరిగేందుకు చర్యలు తీసుకున్నారని ఆమె అన్నారు. చెరువుల పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. మిషన్ భగీరథతో(Mission Bhagirathi) ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందించారని చెప్పారు.
అయితే లక్ష్మీపార్వతికి కేసీఆర్ మీద ఇంత అభిమానం ఎలా పుట్టుకొచ్చిందని పలువురు కామెంట్స్(Comments) చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు(Chandra Babu) సన్నిహితుడు కావడంతో చంద్రబాబుతో పాటు రేవంత్‌ను కూడా ఆమె టార్గెట్ చేసి ఉంటారని విశ్లేషిస్తున్నారు. అయితే లక్ష్మీపార్వతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
