Nagarjunasagar dam : సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి : కేఆర్‌ఎంబీ లేఖ
నాగార్జునసాగర్(Nagarjuna sagar) కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ(Andhra pradesh) ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (KRMB) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్(October) నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల(TMC) నీటిని విడుదల చేసినట్లు లేఖలో(Letter) పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి(Request) అందలేదని స్పష్టం చేశారు. మరో వైపు నల్గొండ(Nalgonda) జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పోలీసు(Police) పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
నాగార్జునసాగర్(Nagarjuna sagar) కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ(Andhra pradesh) ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు (KRMB) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. అక్టోబర్(October) నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల(TMC) నీటిని విడుదల చేసినట్లు లేఖలో(Letter) పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి(Request) అందలేదని స్పష్టం చేశారు. మరో వైపు నల్గొండ(Nalgonda) జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పోలీసు(Police) పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ(Telangana) పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వివాదానికి కారణమేంటి? : రాష్ట్ర విభజన(Reorganisaton) సమయంలో కృష్ణా(Krishna), గోదావరి9Godavari) నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం(Srisailam) జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం(Power project), తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ(Right canal) నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ఇండెంటు(Indent) పంపిన దాఖలాలూ లేవు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది.