కృష్ణా జిల్లా(Krishna District) మచిలీపట్నం(Machilipatnam) జాయింట్ కలెక్టర్ (Joint Collector) డా.అపరాజిత సింగ్‌ సిన్వర్‌(Dr. Aparajita Singh Sinwar) రిజిస్టర్‌ మ్యారేజ్‌(Register Marriage) చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన అపరాజిత సింగ్‌ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్‌(Trainee IPS) దేవేంద్రకుమార్‌ను(Devendra Kumar) వివాహమాడారు.

కృష్ణా జిల్లా(Krishna District) మచిలీపట్నం(Machilipatnam) జాయింట్ కలెక్టర్ (Joint Collector) డా.అపరాజిత సింగ్‌ సిన్వర్‌(Dr. Aparajita Singh Sinwar) రిజిస్టర్‌ మ్యారేజ్‌(Register Marriage) చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన అపరాజిత సింగ్‌ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్‌(Trainee IPS) దేవేంద్రకుమార్‌ను(Devendra Kumar) వివాహమాడారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్‌ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత, దేవేంద్రకుమార్‌ పరస్పరం దండలు మార్చుకున్నారు. యూపీ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. వివాహం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

Updated On 9 Aug 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story