పెంపుడు జంతువులను అల్లారుముద్దుగా పెంచుకోవడం మనకి తెలుసు, కొంతమందైతే పెంపుడు జంతువులకి బంగారు, వజ్ర వైడూర్యాలు తొడగడం కూడా చూస్తుంటాం. ఇక పుట్టినరోజులు, సీమంతాలు షరా మాములే. అవి చనిపోతే వాటికి సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారిని చూస్తుంటాం.

ఖమ్మం(Khammam) లో ఓ కుటుంబం మాత్రం ఒకడుగు ముందుకేసి చనిపోయిన శునకానికి(Dog) వర్థంతి నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించి పెంపుడు శునకం మీదున్న ప్రేమని చాటుకున్నారు.
ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి తొట కిషన్ రావు(Kishan Rao) కుటుంబ సభ్యులు. 2015 అక్టోబరు 2న పుట్టిన 'పుగ్ బ్రీడ్ కు చెందిన శునకాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుని దానికి రెక్స్ అని నామకరణం చేసి కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్నారు. ప్రతీ ఏడాది అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా చేసేవారు. అయితే అనారోగ్యంతో ఆ శునకం 2021 జూలై 20న మరణించింది. దీంతో ఆరోజున మనుషులకు నిర్వహించే మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం ఆ తర్వాతి కార్యక్రమాలను కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
రెక్స్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తున్నా... తమ పెంపుడు కుక్క తాలూకూ స్మృతులు ఆ కుటుంబ సభ్యులు మరిచిపోలేదు. రెక్స్ చనిపోయిన తర్వాత మొదటి వర్ధంతి చేసిన కుటుంబ సభ్యులు గురువారం రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రెక్సి ఖననం చేసిన చోట, ఇంట్లో రెక్స్ చిత్రపటం వద్ద పూజలు చేసి నివాళి అర్పించారు.
అవసరం తీరిన తరవాత మనుషులనే పట్టించుకోని ఈ రోజులో పెంచుకున్న శునకం మీద అంత ప్రేమ పెంచుకున్న కిషన్ రావు కుటుంబాన్ని అందరూ అభినందిస్తున్నారు