పేద కుటుంబాలకు రేషన్ కార్డుల (Ration Cards) మంజూరీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖరువరకు కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నది.
పేద కుటుంబాలకు రేషన్ కార్డుల (Ration Cards) మంజూరీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలాఖరువరకు కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అభయ హస్తం (Abhaya Hastham) దరఖాస్తులు దాదాపు కోటి 25 లక్షలు రావడంతో స్క్రూటినీ చేయడం అధికారులకు కష్టతరంగా మారింది. దీంతో రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. కొత్త రేషన్‌కార్డులతో పాటు రేషన్‌కార్డుల్లో పేర్లు నమోదు చేయడం, లేదా మార్పులు చేర్పులు చేసేందుకు వీలు కల్పించాలని నిర్ణయించారు. రేషన్ కార్డుల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి కొత్తవాటిని మంజూరు చేయనున్నట్లు సమాచారం.
అంతేకాకుండా పాత రేషన్‌కార్డు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకోవాలని తెలిపింది. రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఆధార్‌నెంబర్ ఇచ్చి, వేలిముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపింది. జనవరి 31లోగా ఆధార్‌కార్డు, రేషన్ కార్డుతో లింక్ చేసుకోవాలని తెలిపింది. ఈ-కేవైసీ పూర్తి చేయకుంటే రేషన్‌కార్డు తొలగిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం చేసినట్లువుతందని అధికారులు అంచనా వేస్తున్నారు.