Kesineni Nani : 11న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని
తెలుగుదేశం పార్టీని(TDP) వీడిన కేశినేని నాని(Kesineni Nani) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మాటాముచ్చట అయ్యిందని వినికిడి. ఈ నెల 11వ తేదీన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో(YSRCP) కేశినేని నాని చేరబోతున్నారట! తనకు ఎంపీ టికెట్‌తో పాటు మరో అయిదు అసెంబ్లీ(Assembly) స్థానాలను కేశినాని కోరారట!
తెలుగుదేశం పార్టీని(TDP) వీడిన కేశినేని నాని(Kesineni Nani) వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే మాటాముచ్చట అయ్యిందని వినికిడి. ఈ నెల 11వ తేదీన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో(YSRCP) కేశినేని నాని చేరబోతున్నారట! తనకు ఎంపీ టికెట్‌తో పాటు మరో అయిదు అసెంబ్లీ(Assembly) స్థానాలను కేశినాని కోరారట! విజయవాడ తూర్పు(Vijayawada East) నియోజకవర్గం నుంచి తన కూతురు కేశినేని శ్వేతను(Kesineni Swetha) నిలబెట్టాలని నాని అనుకుంటున్నారు. అలాగే విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్.ఎస్.బేగ్‌ను, నందిగామ నియోజకవర్గం నుంచి కన్నెగంటి జీవరత్నంను, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసును, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావును బరిలో దింపాలని అనుకున్నారు కేశినేని నాని. ఇదే విషయాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినాయకత్వానికి చెప్పారట! అయితే ఓ ఎంపీ టికెట్, రెండు అసెంబ్లీ టికెట్లు మాత్రమే ఇస్తామని అధిష్టానం చెప్పిందట!