Sleep Shopping : నిద్రలో షాపింగ్ చేసేవాళ్లను చూశారా?
నిద్రలో నడిచేవాళ్లు(sleep walk) చాలా మందే ఉంటారు. అదో రకమైన జబ్బు. కానీ నిద్రలో షాపింగ్(Sleep shopping) చేసే వ్యాధి కూడా ఒకటుందని తెలుసా? ఈ జబ్బున్న వ్యక్తులు నిద్రలోనే తెలియకుండా షాపింగ్ చేసేస్తుంటారట! మెలుకవ వచ్చాక కానీ అసలు విషయం తెలియదట! ఇలాంటి అరుదైన వ్యాధితో బ్రిటన్‌కు(Britain) చెందిన 42 ఏళ్ల కెల్లీ నూన్స్(Kelly Nunes) బాధపడుతోంది.
నిద్రలో నడిచేవాళ్లు(sleep walk) చాలా మందే ఉంటారు. అదో రకమైన జబ్బు. కానీ నిద్రలో షాపింగ్(Sleep shopping) చేసే వ్యాధి కూడా ఒకటుందని తెలుసా? ఈ జబ్బున్న వ్యక్తులు నిద్రలోనే తెలియకుండా షాపింగ్ చేసేస్తుంటారట! మెలుకవ వచ్చాక కానీ అసలు విషయం తెలియదట! ఇలాంటి అరుదైన వ్యాధితో బ్రిటన్‌కు(Britain) చెందిన 42 ఏళ్ల కెల్లీ నూన్స్(Kelly Nunes) బాధపడుతోంది. ఈ జబ్బును వైద్య పరిభాషలో పారసోమ్నియా అంటారు. పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌గా(Parasomnia) పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటుంది. చిన్నా చితకా షాపింగ్ కాదు. పిల్లల ఆట వస్తువుల నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తెలియకుండానే కొనేస్తుంటుంది. వాటి బిల్లులను కూడా తెలియకుండానే క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుంటుంది. మెలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే కానీ తను చేసి షాపింగ్ విషయం తెలియదు. ఈ విధంగా లక్షలాది పౌండ్లను పొగొట్టుకుంది. రాత్రి అయితే చాలు భయంతో వణికిపోతుంటుంది. ఈ జబ్బు కారణంగా తన బ్యాంక్ డిటైల్స్‌ను సైబర్ నేరగాళ్లకు కూడా చెప్పేసిందట! వారు ఊరుకుంటారా? సుబ్బరంగా కొంచెం డబ్బును లాగేశారు. ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని కెల్లీ నూన్స్ చెబుతోంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆమెకు తెలియడ లేదు. కొన్ని రోజులు శ్వాస సంబంధ సమస్యల కోసం ముక్కుకు పెట్టుకుంటారే.. అది ధరించి పడుకుంది. అయితే నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందట! అన్నట్టు దీనికి చికిత్స లేదు. పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌తో బాధపడుతున్నవారు నిద్రలోనే నడవడం, మాట్లాడటం, తినడం వంటివి చేస్తుంటారు. ఆ సమయంలో వారి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి సోయిలోకి వస్తారు. సాధారణంగా ఇలాంటివన్నీ రాత్రి వేళ మొదటి జామునే జరుగుతాయంటున్నారు.