యశోద(Yashoda) ఆసుపత్రి నుంచి కేసీఆర్(KCR) వీడియో సందేశం పంపించారు. తనను చూసేందుకు వచ్చిన వేలాది కార్యకర్తలకు(party workers) చేతులెత్తి దండం పెడుతున్నా అన్న కేసీఆర్.. ఎక్కువ మంది వస్తే ఇన్‌ఫెక్షన్(Infection) పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినందున అందరినీ కలవలేకపోతున్నానని చెప్పారు.
యశోద(Yashoda) ఆసుపత్రి నుంచి కేసీఆర్(KCR) వీడియో సందేశం పంపించారు. తనను చూసేందుకు వచ్చిన వేలాది కార్యకర్తలకు(party workers) చేతులెత్తి దండం పెడుతున్నా అన్న కేసీఆర్.. ఎక్కువ మంది వస్తే ఇన్‌ఫెక్షన్(Infection) పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినందున అందరినీ కలవలేకపోతున్నానని చెప్పారు. పది రోజులపాటు(Ten days) దయచేసి ఎవరూ రావొద్దని కేసీఆర్ విన్నవించుకున్నారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యకే వస్తానని అప్పటిదాకా సంయమనం(Patience) పాటించి యశోద ఆస్పత్రికి రావొద్దని విజ్ఞప్తి(Request) చేశారు. తనతో పాటు ఆస్పత్రిలో వందలాది మంది పేషెంట్లు ఉన్నారని వారికి ఇబ్బందులు కల్గించకూడదని విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత(Thanks) తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి చెప్పారు. తనను తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు, హాస్పటల్‌లో(Hospital) ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.