కృష్ణానది(Krishna) మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి(KRBM) అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్(BRS) సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్(KCR) కాంగ్రెస్‌పై(Congress) విరుచుకుపడ్డారు. తెలివిలేక ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారన్నారు. నాలోంటళ్లను అడిగితే ఏం చేయాలో చెప్తాం కదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రాజెక్టులను కాపాడుకున్నామని.. కేంద్రం తనను ఎన్నిసార్లు బెదిరించినా వాటా తేల్చకుండా ప్రాజెక్టులు అప్పజెప్పలేదని కేసీఆర్ అన్నారు.
కృష్ణానది(Krishna River) మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి(KRBM) అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండలో బీఆర్‌ఎస్(BRS) సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కేసీఆర్(KCR) కాంగ్రెస్‌పై(Congress) విరుచుకుపడ్డారు. తెలివిలేక ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించారన్నారు. నాలోంటళ్లను అడిగితే ఏం చేయాలో చెప్తాం కదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రాజెక్టులను కాపాడుకున్నామని.. కేంద్రం తనను ఎన్నిసార్లు బెదిరించినా వాటా తేల్చకుండా ప్రాజెక్టులు అప్పజెప్పలేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టైనా కూడా ప్రాజెక్టులను తీసుకుంటామని కేంద్రం చెప్పినా భయపడలేదని కేసీఆర్ అన్నారు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి వాటా తేల్చాకే ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పాలని, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు టైంబాండ్ పెట్టాలని డిమాండ్ చేయాలన్నారు.
ఈరోజు నల్గొండలో పెట్టిన సభ రాజకీయ సభకాదు. ఐదు జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య అని ఆయన అన్నారు. తన కట్టె కాలేవరకు తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతానని అన్నారు. గత ప్రభుత్వంమీద అబాంఢాలు వేసి తప్పించుకు తిరుగుతామంటే కుదరదన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ప్రభుత్వం మాదేనన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులు 80-90 శాతం పూర్తి చేసుకున్నామని అవి పూర్తి చేసేలా ప్రణాళికలు చేసుకోకుండా కేసీఆర్‌ను తిట్టే పనిలోనే ఉన్నారన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రతిపక్షంగా కొట్లాడుతామన్నారు. కేసీఆర్(KCR) దిగిపోయాక కటుక బంజేసినట్లు కరెంట్ ఎందుకు పోతుంది. రైతు బంధు ఎందుకు వేయలేదంటే చెప్పుతో కొడతామంటున్నారు. రైతులకు మీకంటే మందంగా చెప్పులు ఉంటాయని.. రైతులు కొడితే మూతి పళ్లు రాలుతాయని కేసీఆర్ హెచ్చరించారు. కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం కంటే మంచిగా చేయాలి కానీ.. రోజుకో డ్రామా చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టేందుకే పూట గడవడం లేదని ఆయన విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు మేడిగడ్డ ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజ్‌లు, 20 రిజర్వాయర్లు, 290 కి.మీ.టన్నెల్, 20 పంప్ హౌజ్‌లు, 1500 కి.మీ.కాల్వలు అని ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలిపోతే దానిని సరిచేయకుండా కేసీఆర్ మీద నెపం నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాఫర్ డ్యామ్ పెట్టి కూడా నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు. పులిలా పోరాడుతాను కానీ పిల్లిలా సైలెంట్‌గా ఉండను అని కేసీఆర్ హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదిలో నీటి వాటా కోసం బీఆర్‌ఎస్ కొట్లాడుతూనే ఉంటదని కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించారు. పాలిచ్చే బర్రెను కాదనుకొని దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ చురకలు వేశారు.