Ushasree Constituency changed: మరో మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు స్థాన చలనం..పోటీ ఎక్కడంటే..!
ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్(cm jagan)చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రెండో జాబితా కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి విడదల రజనీని( Minister vidudala rajini) నియోజకవర్గం మార్చిన సీఎం జగన్..మరో మంత్రికి కూడా ఇదే దారి చూపారు. గత ఎన్నికల్లో కల్యాణదుర్గం(kalyana durgam) నుంచి గెలుపొందిన ఉషాశ్రీ చరణ్(Ushasree charan)ను పెనుగొండకు మారుస్తున్నట్టు సమాచారం.
ఏపీలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్(cm jagan)చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రెండో జాబితా కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి విడదల రజనీని( Minister vidudala rajini) నియోజకవర్గం మార్చిన సీఎం జగన్..మరో మంత్రికి కూడా ఇదే దారి చూపారు. గత ఎన్నికల్లో కల్యాణదుర్గం(kalyana durgam) నుంచి గెలుపొందిన ఉషాశ్రీ చరణ్(Ushasree charan)ను పెనుగొండకు మారుస్తున్నట్టు సమాచారం. ఈసారి మంత్రి ఉషశ్రీ కల్యాణదుర్గంలో గెలవడం కష్టమనే అంచనాలు ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి ఉషా శ్రీ చరణ్‌కు స్థానం చలనం తప్పడం లేదనేది పార్టీ వర్గాల సమాచారం. మరి.. ఇప్పుడు కల్యాణదుర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కల్యాణ దుర్గంలో బోయ సామాజికవర్గం జనాభా ఎక్కువ. ఇక్కడి నుంచి మరోసారి బోయ సామాజికవర్గానికి చెందిన నేతకే అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. బోయలకే జగన్ అవకాశం ఇస్తారన్న విషయం స్వయంగా మంత్రి ఉషశ్రీ చరణ్(Ushasree charan) కూడ చెప్పారు. మరి.. పెనుకొండ విషయంలో చేసిన మార్పు సామాజికవర్గాల సమీకరణలను కూడా బ్యాలెన్స్ చేసే విధంగా కనిపిస్తోంది. పెనుకొండ నియోజకవర్గంలో కురుబల జనాభా బాగానే ఉంటుంది. కానీ.. అదే సమయంలో గ్రామాల్లో రెడ్ల జనాభా కూడ ఎక్కువే. ఉషశ్రీ చరణ్ కురుబ, ఆమె భర్త రెడ్డి కావడం ద్వారా.. ఈ రెండు సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా సీఎం జగన్ ఈ మార్పును ఉపయోగించుకుంటున్నారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఇలాంటి మార్పులు మరిన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలకమైన నేతలు అనుకుంటున్న వారి విషయంలోనే మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉండవచ్చనే అంచనాలూ ఉన్నాయి. సిట్టింగులకు స్థాన చలనాలు, మరీ వ్యతిరేకతను పెంచుకున్నవారిని పక్కన పెట్టే విషయంలో సీఎం జగన్ వెనుకాడకపోవచ్చనేది తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది.