Kdapa Constituency: కాకరేపుతున్న కడప రాజకీయం..త్రిముఖ పోరు తప్పదా?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కడప రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ-టీడీపీ నువ్వా నేనా అనే స్థాయిలో ఇక్కడి నుంచి పోటీపడుతున్నాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరడంతో ఇక్కడ త్రిముఖపోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సొంత జిల్లా కడపలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి. ఎలాంటి ఉత్కంఠకు దారితీస్తాయనేదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇటీవల ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల(YS sharmila) సొంత జిల్లా కడపపై ప్రత్యేక పోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సొంతజిల్లా కడపలో రాజకీయంగా పట్టు సాధించాలనే ఆలోచనతో షర్మిల ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కడప రాజకీయం ఆసక్తికరంగా మారింది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Late YS Rajasekhar Reddy) కి అంత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి అహ్మదుల్లా (Former minister Ahmadullah) ఇటీవల షర్మిల సంక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కడప నియోజకవర్గంలో రాజకీయంగా అహ్మదుల్లా కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. 2004, 2009లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా కూడా పని చేశారు. వైఎస్ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో అహ్మదుల్లా సైలెంట్ అయిపోయారు. కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న అహ్మదుల్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కడప కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. అహ్మదుల్లా ఇక్కడ నుంచి పోటీ చేస్తే కడప రాజకీయాలు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప నుంచి అహ్మదుల్లా పోటీ చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. దీంతో వైసీపీ, టీడీపీలోనూ అలజడి మొదలైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా పోటీ చేస్తే..వైసీపీకి మైనార్టీ ఓటు బ్యాంకుకు గండిపడే అవకాశం లేకపోలేదు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్తే..టీడీపీ ఓట్లకు గండిపతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. వైసీపీ, టీడీపీ..ఎవరికివారే బలంగా ఉన్నామని అనుకుంటున్నా..అహ్మదుల్లా పోటీ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందోనన్న టెన్షన్ అభ్యర్థుల్లో మొదలైంది. వైసీపీ నుంచి డిప్యూటీ సీఎం అమ్జాద్ పాషా(Deputy CM Amjad Pasha) మరోసారి పోటీ చేస్తుండగా..టీడీపీ నుంచి ఆర్. మాధవీరెడ్డి(R. Madhavi Reddy) బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సొంతజిల్లాలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి సత్తాచాటాలనే యోచనలో షర్మిల ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి..ఎన్నికలకు ముందే కడపరాజకీయం కాకరేపుతోంది. ఎన్నికల నాటికి కడపం రాజకీయం మరెలా మారుతుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.