ఓ మహిళకు(Woman) మర్డర్‌(Murder) చేయడం అంటే పిచ్చి. అందుకుగాను నేరాలు, ఘోరాల(Neralu, ghoralu) వార్తలను విపరీతంగా టీవీలలో చూసేది. క్రైమ్‌ స్టోరీస్(Crime Stories), నావెల్స్‌(Novels) చదివేది. ఇంట్లో ఉంటూ అదే పనిగా మర్డర్‌ స్టోరీలను చూసేది. వాటినే స్ఫూర్తిగా తీసుకుంది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయ చేయాలో ప్లాన్‌ గీసింది. ఓ మర్డర్‌ చేస్తే ఎలా ఉంటుందో రియల్‌గా తెలుసుకోవాలని అనుకుంది. దక్షిణ కొరియాలోని(South Korea) బుసాన్‌లో(Busan) జుంగ్‌ యూ జుంగ్‌(Jung Yoo Jung) అనే మహిళ ఓ మర్డర్‌కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జుంగ్‌ యూ జుంగ్‌ (23) అనే మహిళ తన తాతతో(Grand father) కలిసి ఉంటుంది. ఏమీ పనిలేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ నేర వార్తలను చూసేది. క్రైమ్‌కు(Crime) సంబంధించిన నవలలను చదివేది. క్రైం ప్రోగ్రామ్‌లు, రియాల్టీ షోలకు బానిసగా మారింది. ఇంటర్నెట్‌లో గంటలు, రోజుల తరబడి సెర్చ్‌ చేసి క్రైమ్‌ స్టోరీస్‌ను చదివేది. ఈ క్రమంలోనే తనకు ఓ ఐడియా వచ్చింది. రియల్‌గా ఎవరినైనా మర్డర్‌ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. మర్డర్‌ ఎలా చేయాలి, శవాన్ని ఎలా, ఎక్కడ పడేయాలో రీసెర్చ్‌ చేసింది. ఈ క్రమంలో తాను ఒక అమ్మాయికి తల్లిగా పరిచయం చేసుకుంది. తన కూతురుకు ఇంగ్లీష్‌ ట్యూషన్‌ చెప్పాలని దాదాపు 50 మందిని కోరింది. పలు యాప్‌లలో ఉన్న ప్యాకల్టీని(Faculty) హోం ట్యూషన్‌(Home Tution) చెప్పాలని కోరేది. నెలల తరబడి వెతికిన తర్వాత ఓ మహిళ ఇందుకు అంగీకరించింది. ట్యూషన్‌ చెప్పేందుకు అంగీకరించిన తర్వాత స్కూల్‌ యూనిఫాం(School Uniform) కూడా కొనుగోలు చేసింది. ఆ యూనిఫాం వేసుకుని ట్యూషన్‌ చెప్పే మహిళ ఇంటికి వెళ్లింది. ట్యూటర్‌ ఇంటికి వెళ్లి తలుపుతట్టగా.. ఆమె తలుపులు తీసిన వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ మహిళపై దాడికి పాల్పడింది. మహిళపై దాదాపు వందసార్లకుపైగా విచక్షణారహితంగా పొడిచింది. మహిళ చనిపోయిన తర్వాత కూడా కత్తిపోట్లను(Stab Wounds) ఆపలేదు. ఆ తర్వాత శవాన్ని ముక్కలు, ముక్కులుగా నరికి సూట్‌కేసులో కుక్కింది. ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి నది దగ్గర పడేసి వెళ్లిపోయింది. సూట్‌కేసు నుంచి రక్తం రావడంతో ట్యాక్సీ డ్రైవర్‌ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జుంగ్‌ యూ జుంగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు యావజ్జీవ ఖైదు(Life imprisonment) విధించింది. దక్షిణకొరియాలో నేరాలకు పెద్దగా తావుండదు.. అలాంటి దేశంలో ఈ మర్డర్‌ ఓ సంచలనమైంది. మహిళ సైకో ఇజంపై దక్షిణ కొరియాలో చర్చనీయాంశమైందట.

Updated On 1 Dec 2023 7:48 AM GMT
Ehatv

Ehatv

Next Story