జపాన్‎లోని టోక్యోలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై దిగుతున్న సమయంలో కోస్ట్‎గార్డ్ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో 375 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

జపాన్‎లోని టోక్యో(Tokyo)లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి(Two planes collided). హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం (Airlines plane) రన్‌వేపై దిగుతున్న సమయంలో కోస్ట్‎గార్డ్ విమానాన్ని(Coast Guard aircraft) ఢీకొట్టింది. దీంతో 375 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో జేఏల్‌ 516 విమానం(JL 516 aircraft)లో సిబ్బంది, ప్రయాణికులు కలిపి 400 మంది వరకు ఉన్నారని టైమ్స్‌ వెల్లడించింది. మంటల్లోంచి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం(Japan Airlines plane) పూర్తిగా తగలబడిపోయింంది. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో కచ్చితంగా తెలియరాలేదు. కాగా..కోస్ట్ గార్డ్ విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బందిలో ఐదుగురి ఆచూకీ తెలియరాలేదు. ఒకరు మాత్రమే ప్రాణాలతో తప్పించుకునట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అగ్నిప్రమాదం కారణంగా టోక్యో ఎయిర్‌పోర్ట్‌ (Tokyo Airport)లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. జపాన్‌లోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో హనేడా ఒకటి, చాలా మంది ప్రజలు న్యూ ఇయర్ సెలవుల్లో ప్రయాణిస్తారు.

Updated On 2 Jan 2024 6:28 AM GMT
Ehatv

Ehatv

Next Story