మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గడపడుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఏపీపైనే ఉంది. అటు అధికార, విపక్ష పార్టీలు కూడా అధికారమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు మొదలు పెట్టాయి. ప్రజల నాడిని అంచనా వేయడంతో పాటు ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వైసీపీ(ycp) భావిస్తుండగా.. విపక్షాలు సైతం ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపైన సర్వే సంస్థలు(Survey Organizations) రంగంలోకి దిగాయి. రెండు నెలల ముందే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జన్మత్ పోల్స్(Janmat Polls) వెల్లడించిన సర్వే ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరికొద్ది నెలల్లోనే ఏపీలో ఎన్నికలు(Ap elections) జరగనున్న నేపథ్యంలో ప్రజల నాడి ఏ విధంగా ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు? ఏ పార్టీ విజయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు? అనే అంశాలపై జన్మత్ పోల్స్ ఓ సర్వే(Janmat Polls Survey) నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఏపీలో మరోసారి వైసీపీ(Ycp)నే అధికారంలోకి వస్తుందని జన్మత్ పోల్స్ సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా..అధికార వైసీపీ 166 నుంచి 118 సీట్లు గెలుపొందుతుందని సర్వే వెల్లడించింది. అలాగే టీడీపీ-జనసేన(tdp-JanaSena) పార్టీలు ఉమ్మడిగా 46 నుంచి 48 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి జగనేనని(Ap cm Jagan) స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో పార్టీలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తూ.. సంక్షేమ పథకాలను అందించిన జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఎక్కువ ఇష్టాన్ని కనబరుస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని..అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయనకు విజయాన్ని అందిస్తాయని సర్వేలో వెల్లడైందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Aseembly Elections)పై జన్మత్ పోల్స్ సర్వే(Janmat Polls Survey) చెప్పినట్టే ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేలో మరోసారి వైసీపీదే అధికారమని జన్మత్ పోల్స్ వెలువరిచింది. గత ఫలితాలను బట్టి చూస్తే..జన్మత్ పోల్స్ సర్వే చెప్పిన అంచనాలు నిజం కావడంతో..ఏపీలో మరోసారి వైసీపీ విజయపతాకం ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది.

Updated On 29 Dec 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story