చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లిలో జల్లికట్టు(Jallikattu in Mondivenganapally) మొదలయ్యింది. జల్లికట్టును నిర్వహించవద్దంటూ పోలీసులు చేసిన హెచ్చరికల(Police Worning)ను గ్రామస్తులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎలాగైనా జరిపి తీరాలనే పట్టుదలతో అరకొర వసతులతోనే జల్లికట్టును నిర్వహించారు గ్రామస్తులు.

Jallikattu celebrations
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లిలో జల్లికట్టు(Jallikattu in Mondivenganapally) మొదలయ్యింది. జల్లికట్టును నిర్వహించవద్దంటూ పోలీసులు చేసిన హెచ్చరికల(Police Worning)ను గ్రామస్తులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎలాగైనా జరిపి తీరాలనే పట్టుదలతో అరకొర వసతులతోనే జల్లికట్టును నిర్వహించారు గ్రామస్తులు. ఈ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. పశువులను లొంగదీసుకునే ప్రయత్నంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా తయారుకావడంతో పశువులు కంగారుపడ్డాయి. ఎటు వెళ్లాలో తెలియక చివరకు చెరువులో దూకేశాయి. చెరువులో పడిన పశువులను యజమానులు అతి కష్టం మీద బయటకు తెచ్చుకున్నారు.
