కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్(Working President) తూర్పు జగ్గారెడ్డి(Jaggareddy) సీఎం రేవంత్ రెడ్డి(Cm RevanthReddy)ని కలిశారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సిఎం రేవంత్‎రెడ్డి నివాసంలో దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న సమయంలోనే జగ్గారెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, వర్కింగ్ ప్రెసిడెంట్(Working President) తూర్పు జగ్గారెడ్డి(Jaggareddy) సీఎం రేవంత్ రెడ్డి(Cm RevanthReddy)ని కలిశారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సిఎం రేవంత్‎రెడ్డి నివాసంలో దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న సమయంలోనే జగ్గారెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌(MLC candidates Selection )పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. అందులో గతంలో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు..అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ త్యాగం చేసిన నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ కాగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడుతున్నారు. ఈసారి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఎలాగైనా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని భావిస్తున్న ఆశావహులు..ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఎమ్మెల్సీ పదవుల కోసం అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి, ప్రో కోదండరాం, మహేష్​ కుమమార్ గౌడ్ , హర్కర వేణుగోపాల్ , మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ , వేం నరేందర్ రెడ్డి, బండ్ల గణేష్, తీన్మార్ మల్లన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ, అందెశ్రీ, మాజీ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫెరోజ్ ఖాన్, మధుయాష్కీ గౌడ్, తూర్పు జగ్గారెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పుష్ఫలీల, మైనంపల్లి హన్మంతరావు తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తే..ఆయనపై జగ్గారెడ్డిని ఎంపీగా బరిలో దించుతారే ప్రచారం కూడా ఉంది. మరోవైపు ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్లనున్నారు. ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి, తర్వాతి ప్రాసెస్ బాధ్యతలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించనున్నట్లు తెలిసింది. ఈ పేపథ్యంలో జగ్గారెడ్డి..సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

Updated On 9 Jan 2024 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story