నూరు ఆరైనా..ఆరు నూరైనా మళ్లీ అధికారంలోకి రావాలి..అధికార వైసీపీ ఏకైక లక్ష్యం(ycp power target) ఇదే. ఈ క్రమంలోనే ఏడాదిన్నరగా పార్టీ ఎమ్మెల్యేలపై పనితీరుపై సీఎం జగన్(cm jagan) సొంత సర్వేలు చేయించారు. దాదాపు 60 నుంచి 70 మంది సిట్టింగ్‎లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వే నివేదికలు(Survey report) బయటపెట్టాయి. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, లేక ఎమ్మెల్యేలపై ఉందా అనేది వేరే విషయం. అక్కడ అభ్యర్థిని మారిస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనే అంచనాతోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు.

నూరు ఆరైనా..ఆరు నూరైనా మళ్లీ అధికారంలోకి రావాలి..అధికార వైసీపీ ఏకైక లక్ష్యం(ycp power target) ఇదే. ఈ క్రమంలోనే ఏడాదిన్నరగా పార్టీ ఎమ్మెల్యేలపై పనితీరుపై సీఎం జగన్(cm jagan) సొంత సర్వేలు చేయించారు. దాదాపు 60 నుంచి 70 మంది సిట్టింగ్‎లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వే నివేదికలు(Survey report) బయటపెట్టాయి. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా, లేక ఎమ్మెల్యేలపై ఉందా అనేది వేరే విషయం. అక్కడ అభ్యర్థిని మారిస్తే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనే అంచనాతోనే జగన్ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి(BRS defeat)కి ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతే కారణమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్(kcr) చేయించిన సర్వేల్లోనూ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలిసినా..సిట్టింగ్‎లను మార్చేందుకు సాహసించలేదు. ఇప్పటికిప్పుడు అభ్యర్థులను మారిస్తే..పార్టీలో పెద్ద ఎత్తున అసమ్మతి తలెత్తే ప్రమాదం ఉంటుందని సైలెంటైపోయారనే వాదనలు కూడా ఉన్నాయి. పైగా టిక్కెట్ దక్కని అభ్యర్థులంతా పార్టీ వీడితే మరింత నష్టం జరుగొచ్చని భావించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నమాట. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఐదారు స్థానాలు మినహా పెద్దగా సిట్టింగ్‏లను మార్చలేదు. అయితే దాని కారణంగానే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై పడే అవకాశం ఉందని భావించిన జగన్.. తెలంగాణ తరహాలోనే వ్యతిరేకతను మూటగట్టుకున్న సిట్టింగ్‎లను మార్చి వారి స్థానంలో కొత్తవారిని ఇంఛార్జీలుగా నియమిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, సన్నిహితులు అనే తేడా లేకుండా సానుకూలతలేని అభ్యర్థులను మొహమాటం లేకుండా టికెట్ లేదని చెప్పేస్తున్నారు. ఈ నిర్ణయం మంచిదే అయినా..దాదాపు 60 నుంచి 70 మంది సిట్టింగ్‎లను మార్చడం వల్ల తలెత్తే అసమ్మతి ముప్పు(threat of disagreement) పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేసే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే టికెట్ రాదని నిర్దారించుకున్న నేతలు కండువా మార్చేస్తున్నారు. రాబోయే రోజుల్లో టికెట్ రాని సిట్టింగ్ లంతా ఇతర పార్టీలో చేరితే..ఖచ్చితంగా ఎన్నికల్లో విజయవకాశాలపై ప్రభావంపడే అవకాశం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పటికే జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేతలంతా సరైన ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏపీ బాధ్యతలను వైఎస్ షర్మిల(ys sharmila)కు అప్పంచే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉండటంతో..అసంతృప్త వైసీపీ నేతలంతా ఆ పార్టీలో చేరే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే అధికార పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ వ్యూహం(YS Jagan's strategy) ఏ మేరకు ఫలితాలిస్తుందనే చర్చ జోరందుకుంది.

Updated On 5 Jan 2024 6:43 AM GMT
Ehatv

Ehatv

Next Story