తెలంగాణ (Telangna) ఉద్యమంలో కీలకమైన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) ఒకరు.రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కారణాల వల్ల కేసీఆర్ (KCR) ఆయనను దూరంగా ఉంచారు. కోదండరాం కేసీఆర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీని కూడా స్థాపించారు. కానీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు

తెలంగాణ (Telangna) ఉద్యమంలో కీలకమైన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) ఒకరు.రాష్ట్ర విభజన తర్వాత కొన్ని కారణాల వల్ల కేసీఆర్ (KCR) ఆయనను దూరంగా ఉంచారు. కోదండరాం కేసీఆర్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీని కూడా స్థాపించారు. కానీ ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కేబినెట్‌లో కోదండరాంకు స్థానం కల్పించాలని, త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంను ఎమ్మెల్సీ (MLC) చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్‌లో 12 మంది వరకు ఆశావహులు ఉన్నారు. అయితే కోదండరాంకు ఒక సీటు ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుని ఎడ్యుకేషన్ పోర్ట్‌ఫోలియో ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ సెంటిమెంట్‌ను బీఆర్‌ఎస్‌ (BRS) పేటెంట్‌ హక్కుగా కేసీఆర్‌ పేర్కొంటున్నారు. కోదండరాంను మంత్రివర్గంలోకి తీసుకొని తెలంగాణ ఫ్లేవర్‌ తమ వెంటే ఉందని చెప్పుకునే ప్రయత్నంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు.

Updated On 11 Jan 2024 11:54 PM GMT
Ehatv

Ehatv

Next Story