Saudi Arabia : వాట్సాప్‌లో రెడ్ హార్ట్ సింబల్స్ పంపుతున్నారా? జైలుకెళతారు జాగ్రత్త!
చాలా మందికి స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్. నిమిషానికోసారి వాట్సప్‌ను(What's app) చెక్ చేసుకోవడం అలవాటుగా మారింది. అన్ని దేశాలలో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ ఇదే కాబట్టి దీనికి క్రేజ్ ఎక్కువ. పైగా ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా! కుర్రకారులో వాట్సప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా, ఒకరి మెసేజ్‌కు రెస్పాండ్ అవ్వాలన్నా బోల్డంత టైప్ చేయాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అన్నింటికీ ఎమోజీలే(Emoji)! మనం ప్రేమను వ్యక్తపరచాలన్నా, కోపాన్ని ప్రదర్శించాలన్నా జస్ట్ ఒక్క ఎమోజీలో చెప్పేయొచ్చు. బాధ, సంతోషం, ఆకలి ఇలా ప్రతీ అనుభూతికి సరిపోయే ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి.
చాలా మందికి స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్. నిమిషానికోసారి వాట్సప్‌ను(What's app) చెక్ చేసుకోవడం అలవాటుగా మారింది. అన్ని దేశాలలో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్ ఇదే కాబట్టి దీనికి క్రేజ్ ఎక్కువ. పైగా ఇది యూజర్ ఫ్రెండ్లీ కూడా! కుర్రకారులో వాట్సప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు వాట్సప్‌లో ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా, ఒకరి మెసేజ్‌కు రెస్పాండ్ అవ్వాలన్నా బోల్డంత టైప్ చేయాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు అన్నింటికీ ఎమోజీలే(Emoji)! మనం ప్రేమను వ్యక్తపరచాలన్నా, కోపాన్ని ప్రదర్శించాలన్నా జస్ట్ ఒక్క ఎమోజీలో చెప్పేయొచ్చు. బాధ, సంతోషం, ఆకలి ఇలా ప్రతీ అనుభూతికి సరిపోయే ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అడ్డదిడ్డంగా ఎమోజీలు వాడితే మాత్రం కటకటాలు లెక్కించాల్సి వుంటుంది. చాలా మంది హార్ట్ ఎమోజీలతో(Heart emoji) అవతలివారిని ఇంప్రెస్ చేస్తుంటారు.
అయితే ఇష్టం వచ్చినట్లుగా హార్ట్ సింబల్స్‌ను వాట్సప్‌లో పంపిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త! వాట్సప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని(Red Heart Emoji) వాడితే అది వేధింపులతో సమానమట! హార్ట్ సింబల్‌ను పంపితే రెండేళ్ల వరకు జైలుశిక్షతో పాటు 20 లక్షల రూపాయల జరిమానా విధిస్తారట! అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వాట్సప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారట! భయపడకండి.. ఇది మన దగ్గర కాదు.. సౌదీ అరేబియాలో(Saudi Arabia)! ఇదే తప్పు మళ్లీ చేస్తే 60 లక్షల రూపాయల జరిమానాతో పాటు అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని సౌదీ అరేబియాకు చెందిన యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోతాజ్ కుత్బీ చెప్పారు. ఎందుకిలా అని అడిగితే తెలియని వ్యక్తులతో చాటింగ్ చేయడం, అనవసరమైన చిక్కుల్లో పడకుండా వాట్సప్ వాడకాన్ని మరిం సేఫ్‌గా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సౌదీ అరేబియా చెబుతోంది..