Byzantine period Aladdin Lamp : సైనికులకు దొరికిన అల్లావుద్దీన్ అద్బుత దీపం!
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మధ్య రెండు నెలలుగా భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే! హమాస్ అంతమే తమ లక్ష్యమని చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం అమాయక పాలస్తీనియులపై(Palestine) కూడా విరుచుకుపడుతున్నది. సుమారు 60 రోజులుగా యుద్ధం చేసీ చేసీ అలసిపోయిన ఇజ్రాయెల్ సైనికులు కాసింత సేదదీరారు. వారికి గాజా(Gaza) సమీపంలో అల్లావుద్దీన్ అద్భుతం దీపం(Aladdin Lamp) దొరికింది.
ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) మధ్య రెండు నెలలుగా భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే! హమాస్ అంతమే తమ లక్ష్యమని చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం అమాయక పాలస్తీనియులపై(Palestine) కూడా విరుచుకుపడుతున్నది. సుమారు 60 రోజులుగా యుద్ధం చేసీ చేసీ అలసిపోయిన ఇజ్రాయెల్ సైనికులు కాసింత సేదదీరారు. వారికి గాజా(Gaza) సమీపంలో అల్లావుద్దీన్ అద్భుతం దీపం(Aladdin Lamp) దొరికింది. నిజంగానే ఇది అల్లావుద్దీన్ దీపం కాదు కానీ అచ్చంగా అలాగే ఉంది. ఈ దీపం 15 వందల సంవత్సరాల కిందటి బైజెంటీన్ కాలం(Byzantine period) నాటిదని అంటున్నారు.
ఫీల్డ్‌లో తిరుగుతున్నపుడు కింద ఒక పురాతన వస్తువు దొరికిందని, దాని గుండ్రటి ఆకారం తనను ఎంతగానో ఆకర్షించిందిని సైనికుడు తెలిపాడు. బురదతో కప్పి ఉన్న ఆ వస్తువు పై భాగాన్ని శుభ్రం చేశానని, వెంటనే ఆ దీపాన్ని ఇజ్రాయెల్ ఆంటిక్విటీస్ అథారిటీ(ఐఏఏ)కి చెందిన ఆర్కియాలజిస్ట్‌కు అప్పగించానని చెప్పుకొచ్చాడా సైనికుడు. పురాతన వస్తువును పరిశీలించిన ఐఏఏ అది అయిదు లేదా ఆరవ శతాబ్దానికి చెందిన బైజెంటీన్ కాలం నాటి సాండల్ క్యాండిల్ అని తెలిపింది. దీపం దొరికిన వెంటనే తమకు ఇచ్చిన సైనికులకు ఐఏఏ ధన్యవాదాలు చెప్పింది.