ఇజ్రాయెల్‌ (Iserial) అనుకున్నంత పని చేసింది. హమాస్‌(Hamas) దళాలను గాజా (Gaza) సొరంగాలలోనే జలసమాధి చేసే చర్యలకు ఉపక్రమించింది. గాజా మెట్రోగా పిలిచే హమాస్‌ సొరంగాల్లోకి(Tunnel) సముద్రపు నీటిని పంపిస్తోంది. అయితే వీటిల్లో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంటున్నారు. ఈ దెబ్బతో హమాస్‌ దళాలు దాక్కొన్న ఛాంబర్లు(Chambers), బందీలను దాచిపెట్టిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసం అవుతాయని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఇదే సమయంలో గాజాలోకి వచ్చి చేరే సముద్రపు(Sea) నీరు కారణంగా ఇక్కడి మంచి నీటి వనరులు దెబ్బతింటాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.

ఇజ్రాయెల్‌ (Israel) అనుకున్నంత పని చేసింది. హమాస్‌(Hamas) దళాలను గాజా (Gaza) సొరంగాలలోనే జలసమాధి చేసే చర్యలకు ఉపక్రమించింది. గాజా మెట్రోగా పిలిచే హమాస్‌ సొరంగాల్లోకి(Tunnel) సముద్రపు నీటిని పంపిస్తోంది. అయితే వీటిల్లో నీరు నింపే ప్రణాళిక పూర్తి కావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంటున్నారు. ఈ దెబ్బతో హమాస్‌ దళాలు దాక్కొన్న ఛాంబర్లు(Chambers), బందీలను దాచిపెట్టిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసం అవుతాయని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. ఇదే సమయంలో గాజాలోకి వచ్చి చేరే సముద్రపు(Sea) నీరు కారణంగా ఇక్కడి మంచి నీటి వనరులు దెబ్బతింటాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఈ సొరంగాలను ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్‌ అనేక ఆప్షన్లను(Options) పరిశీలించింది. బంకర్‌ విధ్వంసక బాంబులను(Bombs) ప్రయోగించాలనుకుంది. రసాయన ద్రవాలను పంపించాలనే ఆలోచన చేసింది. శునకాలను, రోబోలను, డ్రోన్‌లను(Drones) పంపించి హమాస్‌ సొరంగాల అంతు చూడాలని అనుకుంది. అయితే ఇవేవీ వర్క్‌ అవుట్‌ కావని తెలుసుకుంది. సొరంగాలను నీటితో నింపడమే మంచి వ్యూహమని ఐడీఎఫ్‌ చీఫ్‌ హెర్జీ హల్వీ(Herzi Halevi) స్పష్టం చేశారు. ఇంతకు మించి ఈయనేమీ చెప్పకపోయినా ఇప్పటికే అయిదు భారీ పంపులను గాజా దగ్గరకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సొరంగాలలో బందీలెవరూ లేరని అంటున్నారు కానీ తాను వాటిని ధ్రువీకరించలేనని అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌(Joe Biden) అన్నారు. ప్రతి పౌరుడి మరణం విషాదకరమేనని, ఇజ్రాయెల్‌ మాటలకు చేతలకు పొంతన ఉండాలని తాను కోరుకుంటున్నానని జోబైడన్‌ అన్నారు. సొరంగాలలోకి నీటిని పంపించాలనే టెక్నిక్‌(Technique) ఇప్పటిదేం కాదు. ఇంతకు ముందు ఈజిప్ట్(Egypt) కూడా ఈ ప్లాన్‌నే అమలు చేసింది. 2015లో గాజాపట్టీ-సినాయ్‌ ద్వీపకల్పం మధ్య సొరంగాలను ధ్వంసం చేయడానికి మధ్యధరా సముద్రం నీటిని వీటిల్లోకి వదిలింది ఈజిప్ట్‌ సైన్యం.

Updated On 13 Dec 2023 2:04 AM GMT
Ehatv

Ehatv

Next Story