ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూరోపియన్‌ నాగరికతలోని విలువలు, హక్కులకు ఇస్లాం సంస్కృతికి చాలా తేడాలున్నాయని, అందుకే యూరప్‌లో(Europe) ఇస్లాంకు చోటు ఉండబోదని జార్జియా మెలోని వ్యాఖ్యానించారు.

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని(Giorgia Meloni) ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూరోపియన్‌ నాగరికతలోని విలువలు, హక్కులకు ఇస్లాం సంస్కృతికి చాలా తేడాలున్నాయని, అందుకే యూరప్‌లో(Europe) ఇస్లాంకు చోటు ఉండబోదని జార్జియా మెలోని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా సౌదీ అరేబియాను(Saudi Arabia), షరియా చట్టలను తప్పు పట్టారు. 'మా యూరోపియన్‌ నాగరికతకు ఇస్లాం సంస్కృతికి చాలా తేడాలున్నాయి. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్‌(Islamic) సెంటర్లకు సౌదీ అరేబియా నిధులు అందిస్తున్నది. అది చాలా తప్పు. ఆ విషయంలో కూడా నాకు మంచి అభిప్రాయం లేదు' అని జార్జియా మెలోని తెలిపారు. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా(Shariya) చట్టాలను ఆమె తప్పుబట్టారు. షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి (Prostitution)కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని(Homosexuality) నేరంగా భావించడమే తప్ప మరొకటి కాదని అన్నారు.

Updated On 18 Dec 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story