Kavitha arrest : తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
ఢిల్లీ లిక్కర్(Delhi Liquor case) కేసులో నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత విచారణకు రాలేనంటూ మెయిల్ పంపారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆమెపై యాక్షన్ తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కవిత అరెస్ట్ ద్వారా బీజేపీ(BJP), బీఆర్‌ఎస్(BRS) రెండూ ఒకటేనన్న కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీలోని ఓ వర్గం భావించడమే కారణమంటున్నారు. కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గాల గుసగుసలు.

ఢిల్లీ మద్యం కేసులో కవిత(Kavitha) గతంలో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండుసార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కవితకు ఈడీ సమన్లు అందలేదు. లోక్‌సభ(Loksabha) ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈడీ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) విచారణను ఎదుర్కొంటున్నారు. సిసోడియా బెయిల్ పిటీషన్లన్నింటినీ కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కవితకు మళ్లీ నోటీసులు రావడం, ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ తప్పదని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.