CM Ramesh : విశాఖ లోక్‌సభ సీటుపై సీఎం రమేశ్ కన్ను
విశాఖ(Vishaka) లోక్‌సభ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అదేమిటో కానీ చాన్నాళ్ల నుంచి స్థానికులెవరూ విశాఖ లోక్‌సభకు(Lok sabha) ఎంపిక కాలేదు. బయట నుంచి వచ్చినవారికే విశాఖ ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. అందుకే స్థానికేతరులు విశాఖను కోరుకుంటుంటారు. ఒకప్పటి తెలుగుదేశంపార్టీ నేత, ప్రస్తుతం బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్(CM Ramesh) కూడా ఆశావహుల్లో ఒకరయ్యారు.
విశాఖ(Vishaka) లోక్‌సభ సీటుపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అదేమిటో కానీ చాన్నాళ్ల నుంచి స్థానికులెవరూ విశాఖ లోక్‌సభకు(Lok sabha) ఎంపిక కాలేదు. బయట నుంచి వచ్చినవారికే విశాఖ ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. అందుకే స్థానికేతరులు విశాఖను కోరుకుంటుంటారు. ఒకప్పటి తెలుగుదేశంపార్టీ నేత, ప్రస్తుతం బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్(CM Ramesh) కూడా ఆశావహుల్లో ఒకరయ్యారు. ఉత్తరాంధ్రలో బలమైన సామాజికవర్గానికి చెందిన సీఎం రమేశ్ తనకు అన్ని రకాల సామాజిక, రాజకీయ సమీకరణాలు కలిసి వస్తాయని అనుకుంటున్నారట! ఈ నెల27వ తేదీన విశాఖకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) వస్తున్నారు. ఆయన స్వాగతం పలుకుతూ వెలిసిన ఫ్లెక్సీలలో సీఎం రమేశ్ బొమ్మ కూడా ఉంది. అసలు విశాఖకు రమేశ్‌కు ఏమిటి సంబంధం? ఎందుకు ఫ్లెక్సీలలో(Flexy) రమేశ్ ఫోటో ఉంది? ఆన్సర్ వెరీ సింపుల్. విశాఖ లోక్‌సభ సీటు మీద రమేశ్ మోజుపడటమే!బీజేపీ అధిష్టానం ఓకే అంటే పోటీ చేయడానికి రమేశ్ సిద్ధంగా ఉన్నారు. టీడీపీ-జనసేన(BJP-Janasena) కూటమితో బీజేపీ కలిసి వస్తుందో రాదో అన్నదానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. టీడీపీ నేతలు మాత్రం పొత్తు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. పొత్తు కుదిరితే విశాఖ నుంచి ఎంపీగా సీఎం రమేశ్ పోటీ చేయాలని అనుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి(Purandeshwari) కూడా విశాఖ టికెట్‌ను ట్రై చేస్తున్నరు. ఇప్పటికే విశాఖలో ఇల్లు కట్టుకున్న రాజ్య సభ సభ్యుడు జీవీల్ నరసింహారావు (GVL Narasimha rao)కూడా టికెట్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీ-జనసేత కూటమితో బీజేపీ పొత్తు కుదిరితే మాత్రం తెలుగుదేశంపార్టీ కరుణాకటాక్షాలు కూడా బీజేపీ నేతలపై ఉండాల్సి వస్తుంది.