ఇప్పటికే ఇంటర్మీడియట్(Inter) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరవుతునన విద్యార్థినీ విద్యార్థులకు కొన్ని సలహాలు, సూచనలు చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్టు బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9, 80, 978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని ఆమె చెప్పారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్(Inter) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షలకు హాజరవుతునన విద్యార్థినీ విద్యార్థులకు కొన్ని సలహాలు, సూచనలు చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్టు బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9, 80, 978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని ఆమె చెప్పారు. 4,78, 718 మంది విద్యార్థులు(Students) ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగా, 5,02, 260 మంది విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్(Second Inter) పరీక్షలు రాయనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో పరీక్షల నిర్వహణపై రివ్యూ చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని, ప్రత్యేక బస్సులు(Special Busses) కూడా ఏర్పాటు చేస్తున్నామని శ్రుతి వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రం లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలాంటి అదనపు పేపర్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్ష కేంద్రం లో సీసీ టీవీ కెమెరాలు(CCTV) ఏర్పాటు చేస్తున్నామని, మంచి నీటి సదుపాయం తో పాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని వివరించారు. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.