☰
✕
బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకింది.
x
బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకింది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది తొలుత చైనాలో ప్రారంభమైంది. హెచ్‌ఎంపీవీ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది న్యూమోవిరిడే, మెటాప్న్యూమోవైరస్ జాతికి చెందినది. ఈ వైరస్ సోకి ఇప్పటికే వేలాది మంది చైనీయులు ఆస్పత్రుల పాలయ్యారు. దీని నివారణకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా ఈ కేసులు వచ్చే అవకాశం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. జనసమూహాలు ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది ఆరోగ్యశాఖ.
ehatv
Next Story