ఎలాగైనా సరే అమెరికా(America)లో అడుగుపెట్టాలనుకున్న వారి ఆలోచనే ప్రాణాలను తీసింది. కెనడా-అమెరికా(Canada-America)సరిహద్దు ప్రాంతంలో ఉన్న సెయింట్ లారెన్స్‌ నది(Saint Lawrence River)లో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దుదాటే క్రమంలో ఎనిమిది మంది శరణార్థులు చనిపోయారు. వీరిలో ఆరుగురు ఇండియాకు చెందిన వారు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం.

ఎలాగైనా సరే అమెరికా(America)లో అడుగుపెట్టాలనుకున్న వారి ఆలోచనే ప్రాణాలను తీసింది. కెనడా-అమెరికా(Canada-America)సరిహద్దు ప్రాంతంలో ఉన్న సెయింట్ లారెన్స్‌ నది(Saint Lawrence River)లో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్రమంగా సరిహద్దుదాటే క్రమంలో ఎనిమిది మంది శరణార్థులు చనిపోయారు. వీరిలో ఆరుగురు ఇండియాకు చెందిన వారు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విషాదం. ఇద్దరు కెనడా పౌరసత్వం ఉన్న రొమేనియన్లు. అయితే చనిపోయిన వారు భారతీయులా కాదా అన్నది ఇంకా నిర్దారణ కాలేదు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు . నదీ తీరంలో ప్రమాదానికి గురైన బోటును గుర్తించిన అధికారులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. వారికి ఒక్కొక్కటిగా మృతదేహాలు దొరికాయి. ఓ చిన్నారికి చెందిన పాస్‌పోర్ట్‌ కూడా దొరికింది. ఆ పాప కూడా చనిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ చిన్నారి మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఇది హృదయ విదారకమైన సంఘటన అని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. చనిపోయినవారిలో చిన్నపిల్లలు కూడా ఉండటం ఘోరమని ఆయన అన్నారు.

కెనడా-అమెరికా దేశాల మధ్య అక్వెసాస్నేలోని మొహవ్క్‌ సరిహద్దు-క్యూబెక్‌ ప్రాంతంలోని సెయింట్‌ లారెన్స్‌ నది గుండా అమెరికాకు చేరే ప్రయత్నం చేస్తుంటారు. జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా రెండు దేశాలలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలా అక్రమంగా సరిహద్దు దాటే వారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారు. రొమేనియాకు చెందిన వారు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాకు పోలీసులు కూడా సహకరిస్తుంటారట. సరిహద్దులోకి వచ్చిన తర్వాత వారిని రహస్యంగా వాహనాల్లో వారు కోరిన ప్రాంతాలకు తరలిస్తుంటారట.

Updated On 1 April 2023 1:19 AM GMT
Ehatv

Ehatv

Next Story