అమెరికాలోని(America) మసాచుసెట్స్‌లో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్‌ కమల్‌ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాకేష్‌ కమల్‌తో(Rakesh Kamal) పాటు ఆయన భార్య టీనా కమల్‌, కూతురు ఆరియానా అనుమానాస్పదంగా మృతి చెందారు. అక్కడి కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. రాకేష్ కమల్‌ కుటుంబం అత్యంత విలాసవంతమైన డోవర్‌ భవనంలో మృతిచెందారని న్యాయవాది(Advocate) మైఖేల్ మొరిస్సే వెల్లడించారు.

వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు కుటుంబసభ్యులను కాల్చి చంపారా లేదా ఆత్మహత్య(Suicide) చేసుకున్నారా అన్నది తేలాలంటే వారి పోస్ట్ మార్టం నివేదిక వరకు ఎదురుచూడాలని న్యాయవాది మైఖేల్‌ మొరిస్సే అన్నారు. మరోవైపు ఆర్థిక సమస్యలే రాకేష్‌, అతని కుటుంబం మృతి చెందడానికి కారణమని స్థానిక పోలీసులు(Police) ఆధారాలను సేకరిస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయన్న కోణంలో విచారిస్తే.. అలాంటి ఆధారాలు లేవని మొరిస్సే అన్నారు. రాకేష్‌ కమల్‌ కుటుంబం 5.45 మిలియన్‌ డాలర్ల విలువైన విలావసవంతమైన భవనంలో నివసిస్తుంది. ఈ భవనాన్ని ఏడాది క్రితమే మసాచుసెట్స్‌కు(Massachusetts) చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌సీకి 3 మిలియన్లకు విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. 2019లో 19 వేల చదరపు అడుగుల ఎస్టేట్‌లో 11 బెడ్‌రూమ్‌లు ఉన్న భవనాన్ని 4 మిలియన్లకు కొనుగోలు చేశారు. అత్యంత విలాసవంతమైన ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన డోవర్‌లో నివసించే రాకేశ్‌ కమల్‌ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరుతో ఓ విద్యారంగ సంస్థను నెలకొల్పారు. 2021లో దీని కార్యకలాపాలు నిలిచిపోయాయి. టీనా కమల్‌ గత ఏడాది సెప్టెంబర్‌లో(September) దివాలా పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు 1 మిలియన్ నుంచి 10 మిలియన్ల అప్పు ఉందని పేర్కొన్నారు. రెండు నెలల తర్వాత కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చివరికి ఆర్ధిక ఇబ్బందులు తాళలేకే రాకేష్‌ కమల్‌ తన భార్య టీనా కమల్‌, ఆరియాను హత్యా చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాకేష్‌ కమల్‌ భార్య టీనా కమల్‌(Teena kamal) భారత్‌లోని ఢిల్లీ యూనివర్సీటీ, అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్‌సైట్‌లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించేవారు. రాకేష్‌ కమల్ బోస్టన్ యూనివర్సిటీ(Boston University), ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా కూడా ఉన్నారు. ఎడ్యునోవాలో చేరక ముందు రాకేష్‌ కమల్‌కు విద్యా విభాగంలో అపారమైన అనుభవం ఉంది. రాకేష్‌ కమల్‌, టీనా కమల్‌ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మోంట్‌లోని మిడిల్‌బరీ కాలేజీ న్యూరోసైన్స్ చదివుతున్నట్లు తెలిపారు.

Updated On 30 Dec 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story