తెలంగాణను(Telangana) తొలకరి పలకరించబోతున్నది. జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు(Monsoon) తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాయి. మే నెలాఖరులో కేరళను(Kerala) తాకనున్న నైరుతి రుతుపవనాలు అట్నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(Rayalaseema) మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజులు పడుతుంది.
తెలంగాణను(Telangana) తొలకరి పలకరించబోతున్నది. జూన్ మొదటివారంలో నైరుతి రుతుపవనాలు(Monsoon) తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాయి. మే నెలాఖరులో కేరళను(Kerala) తాకనున్న నైరుతి రుతుపవనాలు అట్నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ(Rayalaseema) మీదుగా తెలంగాణకు చేరుకుంటాయి. ఇందుకు కనీసం అయిదారు రోజులు పడుతుంది. జూన్ 5వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యన రుతుపవనాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలించక ఆలస్యమైతే జూన్ రెండో వారానికల్లా తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణశాఖ అంటోంది. నిరుడు జూన్ 11వ తేదీన కేరళకు రుతుపవనాలు వచ్చాయి. జూన్ 20వ తేదీ దాటిన తర్వాతే తెలంగాణలో విస్తరించాయన్న విషయం తెలిసిందే. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి రుతువపనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి.